Vivo T4R స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్లు మరియు ప్రైస్ రివీల్ చేసిన వివో.!
Vivo T4R యొక్క కీలకమైన ఫీచర్లు ఈ రోజు విడుదల చేసింది
ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు కెమెరా వివరాలు బయటపెట్టిన వివో
ఈ ఫోన్ ఆయువు పట్టయిన చిప్ సెట్ వివరాలు కూడా అందించింది
వివో ఇండియాలో విడుదల చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Vivo T4R యొక్క కీలకమైన ఫీచర్లు ఈ రోజు విడుదల చేసింది. ముందుగా, ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫస్ట్ లుక్ తో టీజింగ్ ప్రారంభించిన కంపెనీ ఈరోజు ఈ వివో అప్ కమింగ్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్ ను కూడా టీజర్ పేజీ ద్వారా బయట పెట్టింది. ఈ ఫోన్ ఫస్ట్ లుక్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు కెమెరా వివరాలు బయటపెట్టిన వివో, ఇప్పుడు ఈ ఫోన్ ఆయువు పట్టయిన చిప్ సెట్ వివరాలు కూడా అందించింది.
SurveyVivo T4R: లాంచ్
వివో టి4ఆర్ స్మార్ట్ ఫోన్ ను జూలై 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో రిలీజ్ చేస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ యునిక్ ఫోన్ గా లాంచ్ అవుతుంది మరియు లాంచ్ అయిన తర్వాత ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అందుకే, ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ కోసం మైక్రో సైట్ టీజర్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది. ఈరోజు ఈ టీజర్ పేజీ ద్వారా ఈ కీలక ఫీచర్ ను వివో రిలీజ్ చేసింది.
Vivo T4R: ఫీచర్లు
వివో ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ చిప్ సెట్ Dimensity 7400 5G తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇది 4nm ఫ్యాబ్రికేషన్ చిప్ సెట్ మరియు 2.6 GHz CPU క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. ఇది ఆక్టాకోర్ ప్రోసెసర్ మరియు 7,50,000 కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ చిప్ సెట్ తో ఈ ఫోన్ వేగం గురించి వివో హింట్ అందించింది.

ఈ ఫోన్ యొక్క మరో ఫీచర్ కూడా వివో ముందే అనౌన్స్ చేసింది. అదేమిటంటే, ఈ ఫోన్ లాంచ్ అయ్యే ప్రైస్ సెగ్మెంట్ లో అత్యంత సన్నని క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ ఫోన్ గా ఉంటుంది. అంటే, ఇందులో క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు పంచ్ హోల్ కెమెరా ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఫోన్ లో వెనుక ఆరా లైట్ కూడా ఉంటుంది మరియు ఈ ఫోన్ గ్లాసీ బ్యాక్ డిజైన్ తో వస్తుంది.
Also Read: GitHub Spark: అడిగిందే తడవు చిటికెలో APPs సృష్టించే AI ప్లాట్ ఫామ్ తెచ్చిన మైక్రోసాఫ్ట్
Vivo T4R : ప్రైస్
వాస్తవానికి, వివో ఈ ఫోన్ ప్రైస్ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, ‘ఈ ఫోన్ అండర్ రూ. 20,000 లో వేగవంతమైన ఫోన్ గా ఉంటుంది’, అని వివో టీజర్ ద్వారా ప్రకటించింది. అంటే, ఈ ఫోన్ ను రూ. 20,000 రూపాయల ఉప బడ్జెట్ లో లాంచ్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. ఈ ఫోన్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.