వివో టి సిరీస్ యూజర్ బేస్ ను టార్గెట్ చేసి వివో పరిచయం చేసిన T గొప్ప విజయం సాధించింది. ఈ సిరీస్ ఫోన్ అమ్మకాలలో పెరిగిన ఘనమైన పెరుగుదల మరియు యూజర్ ఆదరణను దృష్టిలో ఉంచుకుని వివో T సిరీస్ పరిధిని మరింత విస్తరించాలని చూస్తోంది. వివో టి సిరీస్ నుంచి Vivo T4 Ultra తో ఈ లైనప్ పరిధి మరింత విస్తరించడానికి చూస్తోంది. ఈ ఫోన్ ఇప్పటికే సర్టిఫికేషన్ కోసం ఎదురు చూస్తోంది మరియు ఈ ఫోన్ ఈ సిరీస్ లో వచ్చిన పాత ఫోన్స్ తో పోలిస్తే మరింత గొప్ప ఫీచర్స్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
Vivo T4 Ultra :
ప్రస్తుతం ఈ ఫోన్ సర్టిఫికేషన్ కోసం ఎదురు చూస్తోంది. ఈ అప్ కమింగ్ వివో ఫోన్ లాంచ్ డేట్ మరియు ఇతర వివరాలు బయటకు రాలేదు. అయితే, ఈ ఫోన్ కలిగిన కీలకమైన ఫీచర్లు మాత్రం వెల్లడయ్యాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 50MP Sony IMX921 మెయిన్ కెమెరా, 50MP 3x పెరిస్కోప్ కెమెరా మరియు 8Mp అల్ట్రా వైడ్ కెమెరాలు ఉండే అవకాశం ఉందని మా సోర్స్ ద్వారా తెలుస్తోంది.
ఇక ఈ ఫోన్ కలిగిన డిస్ప్లే వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ 6. 67 ఇంచ్ pOLED డిస్ప్లే కలిగి ఉండవచ్చు. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన కర్వుడ్ స్క్రీన్ ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ కళ్ళకు హాని కలిగించని ఐ కేర్ సర్టిఫికేషన్ కూడా కలిగి ఉంటుంది.
వివో టి4 అల్ట్రా రూమర్ స్పెక్స్ మరియు ఫీచర్లు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రూమర్స్ ప్రకారం, ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 9300 Plus చిప్ సెట్ కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు గొప్ప స్టోరేజ్ ఉండవచ్చు. ఈ ఫోన్ బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ వివరాల గురించి ఎటువంటి రూమర్ లేదు.
ఈ అప్ కమింగ్ వివో ఫోన్ అధికారిక లాంచ్ డేట్ మరియు అదిరిక ఫీచర్స్ తో మళ్ళీ కలుద్దాం.
గమనిక: పైన అందించిన మెయిన్ ఇమేజ్ వివో టి4 అల్ట్రా ఫోన్ ది కాదని గమనించాలి