Vivo T4 5G Sale: భారీ ఆఫర్స్ తో ఈరోజు నుంచి స్టార్ట్ అయిన వివో కొత్త ఫోన్ సేల్.!
Vivo T4 5G Sale ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది
భారీ ఫీచర్స్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేసిన వివో ఈ ఫోన్ పై భారీ డీల్స్ కూడా అందించింది
ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది
Vivo T4 5G Sale ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. భారీ ఫీచర్స్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేసిన వివో ఈ ఫోన్ పై భారీ డీల్స్ కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు వివో అధికారిక సైట్ నుంచి ఈరోజు భారీ ఆఫర్స్ తో సేల్ అవుతోంది. ఈ లేటెస్ట్ వివో ఫోన్ ధర, ఆఫర్లు మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేయండి.
SurveyVivo T4 5G Sale : ఆఫర్స్
వివో టి4 5జి స్మార్ట్ ఫోన్ 8GB + 128GB బేసిక్ వేరియంట్ ను రూ. 21,999 ధరతో మరియు 12GB + 256GB హైఎండ్ వేరియంట్ ను రూ. 25,999 ధరతో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 2000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను Axis, HDFC మరియు SBI బ్యాంక్స్ యొక్క క్రెడిట్/డెబిట్ కార్డ్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. అయితే, ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే అందుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 19,999 రూపాయల ప్రారంభ ధరకే అందుకోవచ్చు.
Vivo T4 5G : ఫీచర్స్
వివో టి4 5జి స్మార్ట్ ఫోన్ ను Snapdragon 7s Gen 3 చిప్ సెట్ తో అందించింది. దీనికి జతగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను భారీ 7300 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.

ఈ వివో కొత్త ఫోన్ 6.77 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు లైట్ వైట్ తో వస్తుంది.
Also Read: Amazon Great Summer Sale నుంచి షియోమీ లేటెస్ట్ స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!
వివో టి4 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP (OIS) ప్రధాన కెమెరా + 2MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 32MP సెల్ఫీ కెమెరాతో కూడా వస్తుంది. ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్స్ మరియు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ MIL-STD-810H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో వస్తుంది.