ఈరోజే విడుదలైన vivo T3 5G Top-5 ఫీచర్స్ మరియు ప్రైస్ తెలుసుకోండి.!
వివో తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వివో టి3 5జి ని విడుదల చేసింది
vivo T3 5G Top-5 ఫీచర్స్, స్పెక్స్ మరియు ప్రైస్ ఆకట్టుకుంటున్నాయి
ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన ఫీచర్స్ తో 20 వేల బడ్జెట్ లో విడుదల చేసింది
వివో ఈరోజు ఇండియాలో తన లెట్స్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వివో టి3 5జి ని విడుదల చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ vivo T3 5G Top-5 ఫీచర్స్, స్పెక్స్ మరియు ప్రైస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే, వివో ఈ ఫోన్ ను మంచి డిజైన్, ట్రిపుల్ రియర్ కెమేరా మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో 20 వేల బడ్జెట్ లో విడుదల చేసింది. వివో కొత్తగా తీసుకు వచ్చిన ఈ కొత్త ఫోన్ వివరాల పైన ఒక లుక్కేద్దాం పదండి.
Surveyవివో టి3 5జి : ధర
వివో ఈ స్మార్ట్ ఫోన్ 8GB + 128GB వేరియంట్ ను రూ. 19,999 ధరతో మరియు 8GB + 128GB వేరియంట్ ను రూ. 21,999 ధరతో విడుదల చేసింది.
ఆఫర్లు:
అయితే ఈ ఫోన్ పైన మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. ఈ ఫోన్ ను HDFC మరియు SBI బ్యాంక్ కార్డ్స్ లేదా ఎక్స్ చేంజ్ ఆఫర్ తో కొనే వారికి రూ. 2,000 భారీ అధనపు డిస్కౌంట్ లభిస్తుంది.
Vivo T3 5G Top-5
Display
వివో ఈ ఫోన్ ను 6.67 అంగుళాల పరిమాణం కలిగిన AMOLED డిస్ప్లేతో అందించింది. ఈ స్క్రీన్ Full HD+ (2400 x 1080) పిక్సెల్స్ రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది స్మూత్ గేమింగ్ మరియు స్టన్నింగ్ విజువల్స్ అందిస్తుంది.
Processor

వివో ఈ లేటెస్ట్ 5జి ఫోన్ ను MediaTek Dimensity 7200 ఫాస్ట్ ప్రోసెసర్ తో లాంఛ్ చేసింది. ఈ ప్రోసెసర్ 734K+ AnTuTu స్కోర్ తో వస్తుంది. ఈ ప్రోసెసర్ HD కంటెంట్, మల్టీ టాస్కింగ్ తో పాటుగా మంచి గేమింగ్ అనుభూతిని ల్యాగ్ లేకుండా అందించ గలదని వివో తెలిపింది.
RAM & ROM

ఈ వివో ఫోన్ LPDDR4X 8 GB RAM మరియు 8 GB expanded RAM తో టోటల్ 16 GB ర్యామ్ ఫీచర్స్ ని అందిస్తుంది. అంతేకాదు, ఇందులో 128 GB మరియు 256 GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా కలిగి ఉంటుంది. తద్వారా ఈ ఫోన్ మరింత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ను అందిస్తుందని వివో తెలిపింది.
Also Read: Election 2024: ఎలక్షన్ డేట్స్ వచ్చేశాయి.. ఓటర్ లిస్ట్ లో మీ వివరాలు ఇలా చెక్ చేసుకోండి.!
Camera

విప్ టి3 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP + 2MP ట్రిపుల్ రియర్ కెమేరా వుంది. ఇందులో 50 MP (Sony IMX882) + 2MP బొకే + ఫ్లికర్ సెన్సార్ కూడా వుంది. ఈ కెమేరా (OIS + EIS) సపోర్ట్ తో 4K Video లను చాలా స్టడీగా కూడా షూట్ చెయ్యగలదని వివో చెబుతోంది. అలాగే, ఈ ఫోన్ ముందు భాగంలో 16 MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.
Battery & charging

వివో టి3 5జి ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ వుంది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చెయ్యగల 44W ఫాస్ట్ ఛార్జ్ టెక్ ను కూడా ఈ ఫోన్ లో అందించింది. అలాగే, ఈ వివో ఫోన్ లేటెస్ట్ Android 14 OS పైన Funtouch OS 14 సాఫ్ట్ వేర్ తో పని చేస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile