HIGHLIGHTS
Vivo T1 5G రేపు ఇండియాలో విడుదల అవుతుంది
స్నాప్ డ్రాగన్ 695 ప్రోసెసర్ తో వస్తోంది
6.67 ఇంచ్ FHD+ LCD డిస్ప్లే ని కలిగివుంది
గత కొంత కాలంగా వివో టీజ్ చేస్తున్న Vivo T1 5G రేపు ఇండియాలో విడుదల అవుతుంది. వివో ఈ స్మార్ట్ ఫోన్ ను రేపు మద్యహ్నం 12 గంటలకి లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను స్నాప్ డ్రాగన్ 695 5G ప్రోసెసర్,120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు మరిన్ని ఫీచర్లతో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.
Surveyవాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్ గత సంవత్సరమే చైనాలో విడుదల చెయ్యబడింది. కానీ, ఇండియన్ వేరియంట్ మాత్రం కొన్ని మార్పులతో ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, చైనా వేరియంట్ స్నాప్ డ్రాగన్ 778 ప్రోసెసర్ తో ఉంటే, ఇండియన్ వేరియంట్ మాత్రం స్నాప్ డ్రాగన్ 695 ప్రోసెసర్ తో వస్తోంది.
Vivo T1 5G చైనా వేరియంట్ 6.67 ఇంచ్ FHD+ LCD డిస్ప్లే ని కలిగివుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR10 కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్ ఉంది. ఈ వివో స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్ సెట్ తో వస్తుంది. ఇందులో టర్బో డిజైన్ మరియు టర్బో కూలింగ్ సిస్టం అందించినట్లు కూడా కంపెనీ తెలిపింది.
ఇక కెమెరాల పరంగా, T1 లో 50MP ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరాని కలిగి వుంది. ఈ ఫోన్ ను #GetSetTurbo అనే హ్యాష్ ట్యాగ్ తో మరియు అన్ని ఫీచర్లను కూడా టర్బో నినాదం తో చూపిస్తోంది. అంటే, ఈ ఫోన్ అన్ని ఫీచర్ల పరంగా వేగవంతమైనదని చెప్పకనే చెబుతోంది.