వివో తన S సిరీస్ నుండి S5 స్మార్ట్ ఫోన్ను లాంచ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది

వివో తన S సిరీస్ నుండి S5 స్మార్ట్ ఫోన్ను లాంచ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది
HIGHLIGHTS

ఒక స్నాప్‌డ్రాగన్ 675 చిప్‌ సెట్‌ తో రానున్నట్లు అర్ధమవుతోంది.

గత వారం, వివో తన రాబోయే వివో ఎస్ సిరీస్ స్మార్ట్‌ ఫోన్ను లాంచ్ చేయబోతోందని టీజర్ వస్తోంది. ఈ కొత్త ఫోన్ను వివో ఎస్ 5 పేరుతో లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సిరీస్‌లో ఇది మూడవ మొబైల్ ఫోన్‌గా రావచ్చని చెబుతున్నారు, అంటే వివో యొక్క ఎస్ సిరీస్ నుండి,  ఇది కాకుండా, మరో రెండు స్మార్ట్‌ ఫోన్లు ఇప్పటికే ఈ సిరీస్‌లో చేర్చబడ్డాయి, వీటిలో వివో ఎస్ 1 మరియు వివో ఎస్ 1 ప్రో మనకు తెలుసు. . వివో ఎస్ 5 కు సంబంధించి వీబోలో ఇప్పుడు కొంత సమాచారం వెల్లడైంది, ఈ మొబైల్ ఫోన్ ప్రారంభ తేదీ ఇక్కడ చూపిస్తోంది.

అయితే, ఇందుకోసం యానిమేటెడ్ టీజర్ వీబోలో రన్ అవుతోంది, ఈ టీజర్ నుండి ఈ మొబైల్ ఫోన్ నవంబర్ 14 న లాంచ్ కానునాట్లు తెలుస్తోంది. అయితే, ఇది కాకుండా, ఈ టీజర్ ద్వారా మరే ఇతర వివరాలు బయటకు రాలేదు. అయితే, ఇటీవలే ఈ మొబైల్ ఫోన్ గురించి సమాచారం బయటపడింది.

ఈ మొబైల్ ఫోన్ను చైనా మార్కెట్లో వివో ఎస్ 5 గా లాంచ్ చేయవచ్చు, అందులో మీకు డైమండ్ షేప్ ట్రిపుల్ రియర్ కెమెరా లభిస్తుంది. ఈ మొబైల్ ఫోన్‌ యొక్క టీజింగ్ కూడా ఇటీవల ఆన్లైన్లో వచ్చింది. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్‌తో పాటు, మరో మొబైల్ ఫోన్ గురించి సమాచారం కూడా బయటకు వస్తోంది. దీని ప్రకారం,  ఈ మొబైల్ ఫోన్ను వివో ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 చిప్‌ సెట్‌ తో లాంచ్ చేయవచ్చని, దీని గురించి కూడా వీబో ద్వారానే సమాచారం బయటపడింది.

ఇక ఈ టీజర్ ఇమేజ్ గురించి చర్చిస్తే, ఈ వివో స్మార్ట్‌ ఫోనులో మీరు ఒక స్నాప్‌డ్రాగన్ 675 చిప్‌ సెట్‌ తో రానున్నట్లు అర్ధమవుతోంది. అలాగే, ఈ ఫోనులో వెనుక ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉండనుంది. అలాగే, వెనుక ప్యానల్లో ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండనున్నట్లు చూడవచ్చు.

మీరు ఈ ఇమేజిని పరిశీలిస్తే, ఈ మొబైల్ ఫోన్ బ్లూ కలర్ డిజైన్‌లో చూపబడింది. అలాగే దానికి ఒక S- ఆకారపు గ్రేడియంట్ ప్యానెల్‌ లో చూడవచ్చు. ఇది కాకుండా, ఈ ఫోన్ యొక్క వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్‌ను కూడా ఇక్కడ చూడవచ్చు, అలాగే మైక్రో-యుఎస్‌బి పోర్టును 3.5 ఎంఎం ఆడియో జాక్‌తో పాటు ఈ ఫోన్‌ లో కూడా చూడవచ్చు.

ఈ రాబోయే వివో ఫోన్ ఎప్పటివరకూ అందుబాటులో ఉంటుంది, అనేవిషయం గురించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. అయితే, ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లా కనిపిస్తుంది. ఇది వివో నుండి USB టైప్ C పోర్టును కలిగి లేనందున, దీనికి బదులుగా మీరు దానిలో మైక్రో USB  పోర్టును పొందువచ్చు. అలాగే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 675 తో వివో నుండి లాంచ్ చేయబోయే ఇలాంటి నాలుగవ స్మార్ట్‌ ఫోన్ ఇదే అవుతుంది.

గమనిక: Image ఫాంటసీ చిత్రం!

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo