రేపు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ViVO V23 Series: ఫీచర్లు అదుర్స్..!

HIGHLIGHTS

Vivo V23 స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది

ఇండియాలో రంగులు మార్చే డిజైన కలిగిన మొట్టమొదటి ఫోన్

Vivo V23 Pro స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 1200 చిప్‌సెట్ శక్తితో వస్తుంది

రేపు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ViVO V23 Series: ఫీచర్లు అదుర్స్..!

Vivo V23 స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు వివో ఈ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేయడానికి డేట్ మరియు టైం సెట్ చేసింది. ఈ సిరీస్ నుండి వివో v23 మరియు v20 ప్రో స్మార్ట్ ఫోన్లలను ప్రకటించవచ్చు. ఈ ఫోన్లను కొత్త ఫీచర్లతో తీసుకువస్తునట్లు కూడా ప్రకటించింది. విడుదల తరువాత, ఇండియాలో రంగులు మార్చే డిజైన కలిగిన మొట్టమొదటి ఫోన్ గా ఇది నిలుస్తుంది. కేవలం ఇది మాత్రమే కాదు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను ఈ ఫోన్ లో అందించినట్లు వివో చెబుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo V23 Pro: టీజ్డ్ మరియు లీక్డ్ స్పెక్స్

వివో ఇప్పటికే అందించిన వివరాల ప్రకారం, Vivo V23 Pro స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 1200 చిప్‌సెట్ శక్తితో వస్తుంది. ఇది 8GB ర్యామ్ మరియు 4GB ఎక్స్టెండేడ్ ర్యామ్ తో జత చేసుకునే విధంగా ఉంటుంది. ఈ ఫోన్ మెటల్ బాడీ మరియు 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది.  ఈ ఫోన్ లో 50MP Eye AF డ్యూయల్ సెల్ఫీ కెమెరాని మరియు వెనుక 108MP కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ ను వెబ్ సైట్ ద్వారా వెల్లడించి. అంతేకాదు, మరొక వేరియంట్ 64MP ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. బహుశా ఇది ViVo V23 ఫోన్ కెమెరా కావచ్చు.     

ఇక ఈ ఫోన్ గురించి లీకైన స్పెక్స్ విషయానికి వస్తే,ఈ ఫోన్ HDR 10+ కి సపోర్ట్ చేసే 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.56 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. ఇది Android 12 ఆధారిత FunTouch OS పై రన్ అవుతుంది. Vivo V23 Pro స్మార్ట్ ఫోన్ 4,300mAh బ్యాటరీని 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.     

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo