వివో U20 బడ్జెట్ ధరలో ఫీచర్లతో వచ్చింది

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 23 Nov 2019
HIGHLIGHTS
  • మంచి గేమింగ్ అనుభవాన్ని అందుకొవచ్చు.

వివో U20 బడ్జెట్ ధరలో  ఫీచర్లతో వచ్చింది
వివో U20 బడ్జెట్ ధరలో ఫీచర్లతో వచ్చింది

వివో సంస్థ,  ఇండియాలో VIVO U 20 స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, స్నాప్ డ్రాగన్ 675 SoC తోపాటుగా ఒక పెద్ద 5000mAh బ్యాటరీ తో లాంచ్ చెయ్యబడింది. ఈ స్మార్ట్ ఫోన్ను కేవలం రూ .10,990 రూపాయల ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోనులో గేమింగ్ కోసం అల్ట్రా గేమింగ్ మోడ్ తో మంచి గేమింగ్ అనుభవాన్ని అందుకొవచ్చు.  

VIVO U10 :  ధర

వివో యు 20 యొక్క సాధారణ వేరియంట్ రూ .10,990 నుండి ప్రారంభమవుతుంది, ఇది 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ తో ఉంటుంది. ఇది కాకుండా, రూ .11,990 ధరతో 6 జీబీ + 64 జీబీ వేరియంట్ ను తీసుకొచ్చారు. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ నవంబర్ 28 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి జరగనుంది. అయితే, ఫస్ట్ సేల్ ఆఫర్ క్రింద ఈ ఫోన్ను మొదటి సేల్ నుండి ముందస్తు చెల్లిపు చేసేవారికి, 1000 తగ్గింపు లభిస్తుంది. అధనంగా, రిలయన్స్ జియో బెనిఫిట్స్ క్రింద 6000 బెనిఫిట్స్ మరియు 6 నెలల EMI తో కొనేవారి కోసం NO Cost EMI ని ప్రకటించింది.         

VIVO U20 ప్రత్యేకతలు

ఈ వివో యు 20 ఒక పెద్ద 6.35-అంగుళాల FHD + ఐపిఎస్ డిస్ప్లే తో లాంచ్ చేయబడింది మరియు ఈ ఫోన్ బ్లేజ్ బ్లూ మరియు రేసింగ్ బ్లాక్ వంటి రెండు మంచి కలర్ రంగులలో అందించబడుతోంది. ఇవి కాకుండా, ఒక పెద్ద 5000 mAh బ్యాటరీ కూడా ఈ ఫోనులో అందించబడింది, ఇది 18w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675AIE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి, ఈ ఫోన్ అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది, అలాగే ఫోనులో డార్క్ మోడ్‌ ని కూడా అందించారు.ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 పై ఆధారితంగా Funtouch OS 9.2 స్కిన్ పైన నడుస్తుంది.    

కెమెరా విభాగం గురించి మాట్లాడితే, ఈ ఫోన్ వెనుక భాగంలో AI ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, దీనిలో 16 MP ప్రాధమిక కెమెరా మరియు దానికి జతగా ఒక 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు మూడవదిగా  2 MP  మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.

logo
Raja Pullagura

email

Tags:
u20
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
₹ 14999 | $hotDeals->merchant_name
Redmi 9A (Sea Blue, 3GB Ram, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor
Redmi 9A (Sea Blue, 3GB Ram, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor
₹ 7499 | $hotDeals->merchant_name
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
₹ 10999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
₹ 16999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status