vivo latest 200mp camera phone Vivo V70 FE sale started with big deals
Vivo V70 FE: భారీ 200MP కెమెరాతో వివో లేటెస్ట్ గా విడుదల చేసిన వివో వి 70 FE స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను వివో అద్భుతమైన ఫీచర్స్ తో ఆకర్షణీయమైన ధరలో అందించడమే కాకుండా గొప్ప డీల్స్ కూడా ఈ ఫోన్ పై అందించింది. లాంచ్ ఆఫర్స్ తో స్టార్టింగ్ డేస్ సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ను మంచి డిస్కౌంట్ ధరలో అందుకునే అవకాశం యూజర్లకు అందుబాటులో ఉంది.
వివో ఈ స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ యూజర్ ను టార్గెట్ చేసి ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మొత్తం మూడు వేరియంట్లు మరియు రెండు రంగుల్లో ఆఫర్ చేసింది. ఇక ప్రైస్ విషయానికి వస్తే, ఈ ఫోన్ స్టార్టింగ్ (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ రూ. 37,999 ప్రైస్ ట్యాగ్ తో, (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ రూ. 40,999 ప్రైస్ తో మరియు (12 జీబీ + 128 జీబీ) వేరియంట్ రూ. 44,999 ధరతో లభిస్తాయి. ఈ ఫోన్ నాథర్న్స్ లైట్ పర్పల్ మరియు మాన్సూన్ బ్లూ రెండు కలర్స్ లో మీకు లభిస్తుంది.
ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ని వివో అందించింది. ఈ ఫోన్ పై 10% అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ (గరిష్టంగా రూ. 4,500) ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ కేవలం రూ. 33,899 ధరకే లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పై Axis, ICICI మరియు Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన కూడా 10% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే లభిస్తుంది. అదనంగా, ఈ ఫోన్ పై పూర్తిగా 1 ఇయర్ అదనపు వారంటీ ఆఫర్ కూడా వివో ఉచితంగా అందించింది. Buy From Here
Also Read: Jio Best Plans: నెలకు కేవలం రూ. 300 ఖర్చుతోనే అన్లిమిటెడ్ 5G బెనిఫిట్స్ అందించే బెస్ట్ ప్లాన్స్.!
ఈ ఫోన్ 6.83 ఇంచ్ పెద్ద OLED స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ వివో లేటెస్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7360 Turbo చిప్ సెట్ తో నడుస్తుంది మరియు జతగా 12 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇందులో 7000 mAh బిగ్ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఫీచర్స్ కూడా వివో అందించింది. ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
కెమెరా పరంగా, ఇందులో 200MP భారీ ప్రధాన కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా తో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇది OIS అండ్ EIS సపోర్ట్ తో మంచి స్టేబుల్ ఫోటోలు వీడియోలు అందిస్తుంది. 50MP సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ ఉంది. ఈ ఫోన్ గొప్ప నిలకడ కలిగిన 4K వీడియోలు అందిస్తుంది మరియు గొప్ప AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.