Jio Best Plans: నెలకు కేవలం రూ. 300 ఖర్చుతోనే అన్లిమిటెడ్ 5G బెనిఫిట్స్ అందించే బెస్ట్ ప్లాన్స్.!

HIGHLIGHTS

నెలకు కేవలం రూ. 300 ఖర్చుతోనే అన్లిమిటెడ్ 5G బెనిఫిట్స్ అందించే జియో బెస్ట్ ప్లాన్స్

జియో కూడా తక్కువ ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బేస్ ప్లాన్స్ తన యూజర్ల కోసం అందించింది

యూజర్లకు అన్లిమిటెడ్ లాభాలు కేవలం నెలకు రూ. 300 రూపాయల ఖర్చులోనే అందిస్తాయి

Jio Best Plans: నెలకు కేవలం రూ. 300 ఖర్చుతోనే అన్లిమిటెడ్ 5G బెనిఫిట్స్ అందించే బెస్ట్ ప్లాన్స్.!

Jio Best Plans: నెలకు కేవలం రూ. 300 ఖర్చుతోనే అన్లిమిటెడ్ 5G బెనిఫిట్స్ అందించే జియో బెస్ట్ ప్లాన్స్ కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం రెండు బెస్ట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అదేమిటంటే, జియో మినిమమ్ అన్లిమిటెడ్ 5జి ప్లాన్ రూ. 347 రూపాయలు కదా, మీరేమిటి రూ. 300 ఖర్చుతోనే అన్లిమిటెడ్ 5జి లాభాలు అందించే ప్లాన్స్ అని చెబుతున్నారు, అని అనుకుంటున్నారా. అవును, జియో కూడా తక్కువ ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బేస్ ప్లాన్స్ తన యూజర్ల కోసం అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio Best Plans : ఏమిటా బెస్ట్ ప్లాన్స్?

రిలయన్స్ జియో తన యూజర్ల కోసం అందించిన అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్స్ లో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గా నిలుస్తాయి. ఇప్పటి వరకు మేము చెప్పింది కూడా ఈ రెండు ప్లాన్స్ గురించే. ఈ రెండు ప్లాన్స్ కూడా యూజర్లకు అన్లిమిటెడ్ లాభాలు కేవలం నెలకు రూ. 300 రూపాయల ఖర్చులోనే అందిస్తాయి. ఈ రెండు ప్లాన్స్ అందించే బెనిఫిట్స్ మరియు ప్లాన్ వివరాలు క్లియర్ గా చూద్దాం.

జియో రూ. 899 ప్లాన్

జియో చాలా కాలంగా యూజర్ల కోసం ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 90 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. అంతేకాదు, జియో ట్రూ నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా మరియు 4G నెట్ వర్క్ పై 2జీబీ హై స్పీడ్ అందిస్తుంది. ఇదే కాదు 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి 20 జీబీ అదనపు డేటా కూడా అందిస్తుంది.

Jio Best Plans in under budget

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో మరిన్ని లాభాలు కూడా యూజర్లకు అందుతాయి. అవేమిటంటే, ఈ ప్లాన్ తో 3 నెలల జియో హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను జియో ఉచితంగా అందించింది. అంతేకాదు, 18 నెలల Google Gemini Pro యాక్సెస్ ను కూడా జియో ఈ ప్లాన్ తో ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ కోసం చెల్లించే రూ. 899 రూపాయల మొత్తాన్ని 30 రోజుల వారీగా లెక్కిస్తే నెలకు కేవలం రూ. 300 మాత్రమే అవుతుంది. అంటే, ఈ ప్లాన్ తో నెలకు కేవలం రూ. 300 రూపాయల ఖర్చుతోనే అన్లిమిటెడ్ 5జి తో పాటు అనేక లాభాలు పొందొచ్చు.

Also Read: Infinix Note 60 Pro 5G: స్టన్నింగ్ లుక్ మరియు సూపర్ ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

జియో రూ. 999 ప్లాన్

జియో రూ. 999 ప్లాన్ కూడా చాలా కాలంగా జియో యూజర్ల కోసం అందుబాటులో ఉంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 98 రోజుల వాలిడిటీ యూజర్లకి అందుతుంది. ఇది అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు 98 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి డేటా, 4జి నెట్ వర్క్ పై డైలీ 2 జీబీ డేటా మరియు డైలీ 100 SMS సెండ్ బెనిఫిట్ కూడా అందిస్తుంది.

Jio Best Plan rs 999 prepaid plan

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో మూడు నెలల జియో హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ మరియు 18 నెలల Google Gemini Pro యాక్సెస్ కూడా ఉచితంగా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo