Vivo V70 FE 5G: వివో లేటెస్ట్ 200MP కెమెరా ఫోన్ పై బెస్ట్ డీల్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

లేటెస్ట్ 200MP కెమెరా ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు బెస్ట్ డీల్స్ అందించింది

Vivo V70 FE 5G పవర్ ఫుల్ కెమెరా మరియు బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది

ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన బెస్ట్ డీల్స్ తో మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది

Vivo V70 FE 5G: వివో లేటెస్ట్ 200MP కెమెరా ఫోన్ పై బెస్ట్ డీల్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

Vivo V70 FE 5G : రీసెంట్ గా వివో ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ 200MP కెమెరా ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు బెస్ట్ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ కెమెరా మరియు బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఆకట్టుకునే భారీ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన బెస్ట్ డీల్స్ తో మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo V70 FE 5G: ఆఫర్స్

వివో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. రూ. 37,999 పారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ రోజు కూడా ఇదే ప్రైస్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని ప్రస్తుతం ఈ ఫోన్ పై అందించింది. అదేమిటంటే, ఫ్లిప్ కార్ట్ నుండి SBI, HDFC, గూగుల్ పే మరియు ఫోన్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కొనే వారికి రూ. 3,000 భారీ డిస్కౌంట్ అందిస్తుంది. అంటే, ఈ ఆఫర్ తో ఈ ఫోన్ మీకు రూ. 34,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

Vivo V70 FE 5G : ఫీచర్స్

ఈ వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైన్, శక్తివంతమైన కెమెరా మరియు భారీ బ్యాటరీతో మిడ్ ప్రీమియం సెగ్మెంట్‌ లో వచ్చిన ఆకట్టుకునే స్మార్ట్‌ ఫోన్‌ గా నిలిచింది. ఈ ఫోన్‌ లో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గరిష్టంగా 1900 నిట్స్ బ్రైట్‌ నెస్‌ తో గొప్ప విజువల్ అనుభూతిని అందిస్తుంది.

Vivo V70 FE 5G Offer

ఈ ఫోన్ MediaTek Dimensity 7360 Turbo ప్రాసెసర్‌ తో పని చేస్తుంది మరియు ఈ ఫోన్‌ లో 8GB/12GB LPDDR5 RAM మరియు 128GB/256GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత లేటెస్ట్ OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌ పై నడుస్తుంది. ఈ వివో ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ తో కూడా వస్తుంది.

ఫోటోగ్రఫీ పరంగా, 200MP OIS అల్ట్రా క్లియర్ మెయిన్ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణగా ఉంది. దానికి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా జత చేయబడింది. ఇందులో 50MP ఆటో ఫోకస్ సెల్ఫీ కెమెరాను కూడా అందించారు. ఇది 4K వీడియో రికార్డింగ్, గొప్ప రిజల్యూషన్ తో ఫోటోలు అందిస్తుంది మరియు Ai కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: ప్రీమియం లెథర్ డిజైన్ తో బడ్జెట్ 5.2 Dolby సౌండ్ బార్ లాంచ్ చేసిన GOVO

ఈ ఫోన్ 7000mAh భారీ బ్యాటరీ మరియు 90W ఫ్లాష్ ఛార్జ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 5.4, NFC, డ్యూయల్ 5G SIM సపోర్ట్, స్టీరియో స్పీకర్లు మరియు AI ఆధారిత ఫోటోగ్రఫీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile