ప్రీమియం లెథర్ డిజైన్ తో బడ్జెట్ 5.2 Dolby సౌండ్ బార్ లాంచ్ చేసిన GOVO
ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ GOVO నుంచి కొత్త సౌండ్ బార్ మార్కెట్లో లాంచ్ అయ్యింది
ఈ సౌండ్ బార్ ను ప్రీమియం లెథర్ డిజైన్ తో అందించడం విశేషం
ఈ సౌండ్ బార్ ను True 5.2 Dolby Audio సౌండ్ సపోర్ట్ తో కూడా అందించింది
ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ GOVO నుంచి కొత్త సౌండ్ బార్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ను ప్రీమియం లెథర్ డిజైన్ తో అందించడం విశేషం. ఈ సౌండ్ బార్ లెథర్ డిజైన్ లో ప్రీమియం లుక్స్ లో మెరిసిపోతోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ను True 5.2 Dolby Audio సౌండ్ సపోర్ట్ తో కూడా అందించింది.
SurveyGOVO 5.2 Dolby Audio సౌండ్ బార్: ప్రైస్
గోవో కొత్తగా Go Surround 1008 Pro సౌండ్ బార్ ను కేవలం రూ. 15,999 ధరతో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై ఆకట్టుకునే బ్యాంక్ ఆఫర్స్ కూడా అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫామ్స్ అందించాయి. Buy From Here
GOVO 5.2 Dolby Audio సౌండ్ బార్: ఫీచర్స్
హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు గోవో కొత్త Go Surround 1008 Pro సౌండ్ బార్ ను మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ సౌండ్ బార్ ను 5.2 ఛానల్ ఆడియో సిస్టమ్, 680W భారీ సౌండ్ అవుట్ పుట్ మరియు True Dolby Audio సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ఇంట్లోనే థియేటర్ స్థాయి ఆడియో అనుభూతిని అందిస్తుందని గోవో పేర్కొంది. స్మార్ట్ టీవీకి తగిన శక్తివంతమైన సరౌండ్ సౌండ్ ను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రీమియం ఆడియో సిస్టమ్‌ను కంపెనీ అందించింది.

ఇందులో 5.2 ఛానల్ ఆడియో సెటప్ అందుబాటులో ఉంది. ఇందులో ప్రధాన బార్ తో పాటు 6.5 అంగుళాల డ్యూయల్ సబ్ వూఫర్లు మరియు వైర్డ్ రియర్ శాటిలైట్ స్పీకర్లు కూడా ఉంటాయి. ఈ సెటప్ వల్ల గదిలో అన్ని వైపుల నుంచి ఆడియో వినిపించే నిజమైన సరౌండ్ సౌండ్ అనుభవం లభిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు, లైవ్ స్పోర్ట్స్ మరియు గేమింగ్ సమయంలో బాస్, డైలాగ్ క్లారిటీ మరియు సౌండ్ డెప్త్ మరింత మెరుగ్గా అనిపిస్తుంది.
Also Read : రేపే భారత్ లో Lava Bold N2 5G లాంచ్.. Android 16 తో వచ్చే బడ్జెట్ 5G ఫోన్ ఇదే.!
ఈ సౌండ్ బార్ ను ప్రీమియం లెథర్ డిజైన్ లో మరియు ఆకర్షణీయమైన ప్లాటినం బ్లాక్ ఫినిష్ తో రూపొందించింది. ఈ సౌండ్ బార్ ఆధునిక ఇంటీరియర్ కు సైతం ప్రీమియం లుక్ ను అందిస్తుంది. HDMI ARC, ఆప్టికల్, AUX, USB మరియు బ్లూటూత్ సపోర్ట్ తో టీవీ, స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ మరియు గేమింగ్ కన్సోల్ వంటి పరికరాలతో ఈ సౌండ్ బార్ ను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
