Flipkart Sale నుండి మోటో G71 5G మొదటిసరిగా సేల్ కి వస్తుంది

HIGHLIGHTS

Moto G71 5G Big Saving Days సేల్ నుండి మొదటిసారిగా అమ్మకాలను సాగించనుంది

Snapdragon 695 5G ప్రోసెసర్ తో ఇండియాలో విడుదలైన మొట్టమొదటి ఫోన్

FHD+ AMOLED డిస్ప్లే, క్వాడ్ ఫిక్షన్ కెమెరా మరియు మరిన్ని ఫీచర్లతో తీసుకొచ్చింది

Flipkart Sale నుండి మోటో G71 5G మొదటిసరిగా సేల్ కి వస్తుంది

మోటోరోలా తన ఇండియాలో లేటెస్ట్ గా ప్రకటించిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Moto G71 5G. Flipakrt ప్రకటించిన Big Saving Days సేల్ నుండి మొదటిసారిగా అమ్మకాలను సాగించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ జనవరి 19 నుండి Flipkart లో సేల్ కి అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ సేల్  జనవరి 17 నుండి మొదలవుతుంది మరియు జనవరి 22 వరకూ నడుస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ స్మార్ట్ ఫోన్ ను FHD+ AMOLED డిస్ప్లే, క్వాడ్ ఫిక్షన్ కెమెరా మరియు మరిన్ని ఫీచర్లతో తీసుకొచ్చింది. మరి ముఖ్యంగా, Snapdragon 695 5G ప్రోసెసర్ తో ఇండియాలో విడుదలైన మొట్టమొదటి ఫోన్ గా మోటో G71 5G నిలిచింది.

Moto G71 5G: ప్రైస్

Moto G71 5G ఫోన్ 6GB RAM మరియు 128GB స్టోరేజ్ గల సింగిల్ వేరియంట్ తో వచ్చింది మరియు దీని ధర రూ. 18,999 రూపాయలు.

Moto G71 5G: స్పెక్స్

మోటో జి71 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఇది పంచ్ హోల్ డిజైన్ మరియు DCI-P3 తో వస్తుంది.ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వచ్చింది మరియు ఈ ప్రోసెసర్ తో ఇండియాలో విడుదలైన మొట్టమొదటి ఫోన్ గా కూడా నిలిచింది. ఈ ఫోన్ 6GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ తో జతచెయ్యబడింది. అధనంగా, ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు IP52 వాటర్ రెపెల్లెంట్ తో వస్తుంది.

ఇక కెమెరా విషయానికి వస్తే, మోటో జి71 5జి లో వెనుక క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరా వుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్/డెప్త్ సెన్సార్ మరియు డేడికేటెడ్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి వుంది.

ఈ ఫోన్ ThinkShield మొబైల్ సెక్యురితో బిజినెస్ గ్రేడ్ సెక్యూరిటీ అఫర్ చేస్తుంది మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీని కూడా కలిగిఉంటుంది.     

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo