iPhone 6S కొనటానికి కిడ్నీ అమ్మే ప్రయత్నం

iPhone 6S కొనటానికి కిడ్నీ అమ్మే ప్రయత్నం
HIGHLIGHTS

ఈ రోజులలో ఏ ఫోన్ వాడుతున్నామని చూస్తారు కాని, లోపల ఎన్ని కిడ్నీలు ఉన్నాయని చూడరు గా..!?

రీసెంట్ గా లాంచ్ అయిన ఆపిల్ ఐ ఫోన్ 6S ను కొనటానికి, చైనాలోని ఇద్దరు వ్యక్తులు, Huang మరియు Wu తమ సొంత కిడ్నీ లను అమ్మటానికి ప్రయత్నం చేసారు.

కొనేందుకు డబ్బులు సరిపడా లేవని, తన మిత్రుని సలహా మేరకు Wu అనే వ్యక్తి ఈ నిర్ణయానికి వచ్చాడు అంట. సో కిడ్నీ అమ్మి వచ్చే డబ్బులతో ఐ ఫోన్ లేటెస్ట్ మోడల్ కొనవచ్చు అని వాళ్ల ప్లాన్.

ఈ క్రమంలో ఇంటర్నెట్ లో ఒక illegal ఏజెంట్ ను కూడా ఆశ్రయించారు. అతను Nanjing అనే హాస్పిటల్ లో మెడికల్ పరిక్షలు చేసుకోమని అడగటం జరిగింది. అయితే సెప్టెంబర్ 12 న జరగవలసిన ఈ టెస్ట్స్ కోసం ఏజెంట్ హాస్పిటల్ కు రాలేదు.

దానితో వీల్లిద్దరూ తాము ముందు అనుకున్న పనిని చేయటానికి మొగ్గ చూపించలేదు.కానిHuang అనే వ్యక్తి మాత్రం ఆ నిర్ణయాన్ని వదలలేదు. దానితో తప్పక Wu పోలిస్ కు కాల్ చేయటంతో ఈ విషయం అంతా బయట పడింది. అయితే అప్పటినుండి Huang ఇప్పటివరకూ కనపడటం లేదు.

 

Digit.in
Logo
Digit.in
Logo