Top-5 Phones: రూ.20,000 ధరలో ఇండియాలోని టాప్-5 ఫోన్స్ ఇవే..!!

Top-5 Phones: రూ.20,000 ధరలో ఇండియాలోని టాప్-5 ఫోన్స్ ఇవే..!!
HIGHLIGHTS

ప్రస్తుతం మార్కెట్లో 20 వేల రూపాయల ధరలో మంచి ఫోన్లు లభిస్తున్నాయి

20 వేల ధరలో టాప్-5 స్మార్ట్ ఫోన్స్ లిస్ట్

సత్తాకలిగిన స్మార్ట్ ఫోన్లు కేవలం 20 వేల రూపాయల పరిధిలోనే లభిస్తున్నాయి

ప్రస్తుతం మార్కెట్లో 20 వేల రూపాయల ధరలో మంచి ఫోన్లు లభిస్తున్నాయి. వేగవంతమైన పర్ఫార్మెన్స్ అందించగల ప్రోసెసర్లు మొదలుకొని నిముషాల్లో ఫోన్ ను ఛార్జ్ చెయ్యగల సత్తాకలిగిన స్మార్ట్ ఫోన్లు కేవలం 20 వేల రూపాయల పరిధిలోనే లభిస్తున్నాయి. గతంలో, ఇలాంటి స్పెక్స్ కలిగిన ఒక స్మార్ట్ ఫోన్ కొనాలంటే డబ్బును బాగానే ఖర్చు చేయాల్సి వచ్చేది. అందుకే, ప్రస్తుతం మార్కెట్ లో 20 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లోమంచి స్పెక్స్ మరియు ఫీచర్లతో లభిస్తున్న స్మార్ట్ ఫోన్లలో టాప్-5 స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం.

Redmi Note 11T (Buy Here)

ధర: రూ.16,999

రెడ్ మి నోట్ 11టి 5జి ఫోన్ డ్యూయల్ 5G SIM సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లేని 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగి వుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Dimensity 810 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది. ఈ ఫోన్ వెనుక 50MP AI క్వాడ్ రియర్ కెమెరాని కలిగివుంది. సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఇది MIUI 12.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు,Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది. సెక్యూరిటీ పరంగా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లను కలిగివుంది.   

Poco X3 Pro  (Buy Here)

ధర: రూ.18,999

ఈ Poco X3 Pro ఫోన్ 6.67-అంగుళాల FHD + రిజల్యూషన్ డిస్ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేటుతో మరియు గొరిల్లా గ్లాస్ 6 ని సేఫ్టితో అందించింది. ఈ ఫోన్ గరిష్టంగా 2.96GHz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 640 GPU తో పనిచేస్తుంది. ఇది 6GB/8GB RAM మరియు 128GB UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12 పై పోకో లాంచర్ తో నడుస్తుంది.

Poco X3 pro2 copy.jpg

పోకో X3 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో ప్రాధమిక 48MP కెమెరా,  8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ వుంది. ఈ ఫోన్ పైభాగంలో పంచ్ హోల్ కటౌట్ లోపల 20 MP  సెల్ఫీ కెమెరా ఉంది. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,160 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది.

Realme 8 Pro  (Buy Here)  

ధర: రూ.19,990

ఈ Realme 8 Pro ఒక 6.44 అంగుళాల SuperAMOLED డిస్ప్లేని 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో 180Hz టచ్ శాంప్లింగ్ రేటుతో కలిగివుంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 720G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజితో వస్తుంది.

Realme 8 Pro1.jpeg

ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును అందించింది. ఇందులో,  f/1.88 ఎపర్చర్ కలిగిన ఒక 108MP Samsung HM2 ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, జతగా 2MP మ్యాక్రో మరియు 2MP B&W  సెన్సార్ ని అందించింది. ముందు 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ Realme 8 Pro ఒక 4,500mAh బ్యాటరీని వేగవంతమైన 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటుగా, బాక్స్ లోనే ఒక 65W ఫాస్ట్ ఛార్జర్ ని కూడా అందించింది.

iQOO Z3 5G (Buy Here)

ధర: రూ.17,990

ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ Full-HD+ రిజల్యూషన్ డిస్ప్లే మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ 768G ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది మరియు 1GB ఎక్స్ టెండడ్ ర్యామ్ ఫీచర్ తో వస్తుంది.

iqoo-z3-launch-inline.jpg

ఈ ఫోన్ Android 11 ఆధారితంగా FunTouch 11.1 స్కిన్ పైన పనిచేస్తుంది. ఇందులో 64MP ప్రధాన కెమెరా మరియు జతగా 8ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపి సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ ఫోన్ 55W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4,400 బ్యాటరీ కూడా వుంది.                            

Samsung Galaxy M32 5G (Buy Here)

ధర: రూ.20,999

ఈ శాంసంగ్ ఫోన్ 6.5 అంగుళాల HD+ ఇన్ఫినిటీ V డిస్ప్లేని 60Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఈ ఫోన్‌లో స్పీడ్, గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ అందించడానికి మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ను ఉపయోగించినట్లు శాంసంగ్ తెలిపింది. ఇది మంచి గేమింగ్ మరియు 12 బ్యాండ్స్ వరకూ 5G సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన OneUI 3.1 స్కిన్ పైన నడుస్తుంది.

Samsung Galaxy M32 5G Pricing and Availability 1.jpg

ఈ స్మార్ట్ ఫోన్ వెనుక అందమైన డిజైన్ లో క్వాడ్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 48ఎంపి ప్రధాన కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో కెమెరా మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ లను అందించింది. ముందుభాగంలో, 13ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo