ఇండియాలో 10 వేల ధరలో Top-5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్

ఇండియాలో 10 వేల ధరలో Top-5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్
HIGHLIGHTS

ఇండియాలో 10 వేల ధరలో Top-5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్

కేవలం రూ.10,000 ధరలో ఇండియాలోని టాప్-5 బెస్ట్ స్మార్ట్ ఫోన్ల లిస్ట్

భారీ ఫీచర్లు ధర మాత్రమే 10 వేల లోపలే

ఇండియాలో 10 వేల ధరలో Top-5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ కోసం చూస్తున్నారా? అయితే, మీరు సరైన ప్లేస్ కే వచ్చారు. ఎందుకంటే, ఈరోజు కేవలం రూ.10,000 ధరలో ఇండియాలోని టాప్-5 బెస్ట్ స్మార్ట్ ఫోన్ల గురించి మాట్లాడబోతున్నాము. ఈ లిస్ట్ లో అందించిన 5 లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు కూడా మంచి ఫీచర్లతో అలరిస్తాయి మరియు మీ బడ్జెట్ ధరలో లభిస్తాయి.

1.Realme Narzo 30A (Buy Here)

ధర: రూ.8,999

రియల్మీ నార్జో 30A స్మార్ట్‌ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ గల డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే మినీ డ్రాప్ నోచ్ డిజైన్ తో వుంటుంది. ఈ గరిష్టంగా 570 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది. నార్జో 30A మీడియా టెక్ హీలియో G85 చిప్సెట్ తో పనిచేస్తుంది. రియల్మీ నార్జో 30 A డ్యూయల్ కెమెరా సెటప్పును కలిగివుంది. ఇందులో, 13MP ప్రధాన కెమెరా బ్లాక్ & వైట్ సెన్సార్ లను కలిగివుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని అందించారు. ఈ ఫోన్, అన్లాక్ ఫీచర్లుగా ఫేస్ అన్లాక్ మరియు బ్యాక్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలివుంది. ఈ రియల్మీ నార్జో 30A పెద్ద 6,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కలిగి వుంటుంది.

2. Xiaomi Redmi 9 Prime (Buy Here)

ధర: రూ.10,499   

షియోమి రెడ్‌మి 9 ప్రైమ్ ‌లో సెల్ఫీ కెమెరా కోసం వాటర్ ‌డ్రాప్ నాచ్ కటౌట్‌తో ఒక 6.53-అంగుళాల FHD + (2340 x 1080 పిక్సెల్స్) డిస్ప్లే ఉంది. ఇది మీడియా టెక్ హెలియో G 80 చిప్ ‌సెట్ ‌తో ఆక్టా-కోర్ సిపియు మరియు మాలి-జి 52 జిపియుతో పనిచేస్తుంది మరియు ఇది ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన MIUI 12 పై నడుస్తుంది. ఇది 4 జిబి ర్యామ్‌ తో జతచేయబడుతుంది. రెడ్‌మి 9 క్వాడ్-కెమెరా సెటప్‌ని  కలిగి ఉంది, ఇందులో ప్రాధమిక 13 MP కెమెరాని ఎఫ్ / 2.2 ఎపర్చరు, 8 MP  అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా 118-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ, 5MP మాక్రో కెమెరా మరియు 2 MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. . ముందు వైపు, వాటర్‌ డ్రాప్ నాచ్ కటౌట్ లోపల 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతుతో 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది

3. Poco C3 (Buy Here)

ధర: రూ.8,499

షియోమి పోకో సి 3 లో ఒక 6.53-అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లే మరియు ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్ ఉన్నాయి. పోకో సి 3 మీడియా టెక్ హెలియో జి 35 చిప్‌సెట్ ఆక్టా-కోర్ సిపియు మరియు పవర్‌విఆర్ జిఇ 8320 గ్రాఫిక్‌లతో పనిచేస్తుంది.  ఇది డార్క్ మోడ్ వంటి ఫీచర్లతో ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన సరికొత్త MIUI 12 పై నడుస్తుంది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 13 ఎంపి కెమెరా ఎఫ్ / 1.8 ఎపర్చరు, 2 ఎంపి మాక్రో కెమెరా మరియు 2 ఎంపి డెప్త్ సెన్సార్ ఉన్నాయి. వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్‌లో ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉంది. పోకో సి 3 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో అమర్చబడి ఉంటుంది కాని వేగంగా ఛార్జింగ్ చేయడానికి మద్దతు ఇవ్వదు.

4.  Moto G10 Power (Buy Here)

ధర: రూ.10,499 

ఈ మోటో G10 స్మార్ట్ ఫోన్ 6.5 -అంగుళాల HD + రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది. ఈ G10 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  460 ఆక్టా-కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది 4GB RAM మరియు 64GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది నియర్ ఆండ్రాయిడ్ 11-స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది. మోటో G10 వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48MP కెమెరాకి జతగా 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ లను జతచేసింది మరియు ముందు భాగంలో 8 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 20W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

5. Realme C21Y (Buy Here)

ధర: రూ.8,999

ఈ Realme C21y స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 అంగుళాల HD+ (1600×720 ) పిక్సెల్స్ రిజల్యూషన్ గల డిస్ప్లేని చిన్న వాటర్ డ్రాప్ నాచ్ డిజైనుతో కలిగి వుంటుంది. ఈ ఫోన్ Unisoc T610 ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 12nm ఫ్యాబ్రికేషన్ తో గరిష్టంగా 1.8GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన Realme UI తో వస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాని 13MP AI కెమెరాతో అందించింది. దీనికి జతగా 2ఎంపి మ్యాక్రో మరియు 2ఎంపి పోర్ట్రైట్ సెన్సార్లను కలిగివుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 5ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో పెద్ద 5,000mAh బ్యాటరీని సూపర్ పవర్ సేవింగ్ మోడ్ తో కలిపి ఇచ్చింది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo