ఇండియాలో Top-5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ (ఫిబ్రవరి 2022)

ఇండియాలో Top-5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ (ఫిబ్రవరి 2022)
HIGHLIGHTS

టాప్-5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లిస్ట్

స్పెక్స్ ఆధారంగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ ఫోన్లుగా నిలుస్తాయి

భారతీయ మొబైల్ మార్కెట్ లో అధికశాతం బడ్జెట్ స్మార్ట్ ఫోన్లదే

భారతీయ మొబైల్ మార్కెట్ లో అధికశాతం బడ్జెట్ స్మార్ట్ ఫోన్లదే. అందుకే, స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కూడా అధికశాతం స్మార్ట్ ఫోన్లను  బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకువస్తున్నాయి. వాటిలో ఏది సెలక్ట్ చేసుకోవాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే, మీకు సహాయం చెయ్యడానికి ఈ టాప్-5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లిస్ట్ ను అందించాను. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు వాటి స్పెక్స్ ఆధారంగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ ఫోన్లుగా నిలుస్తాయి. 

1. Moto G31 (Buy Here)

ప్రారంభ ధర: రూ.12,999

Moto G31 ఫోన్ 6.4 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 700 నైట్స్ బ్రైట్నెస్ అందించ గలదు మరియు పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Helio G85 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB/6GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది. ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 13ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  20W టర్బో పవర్ ఛార్జర్ తో కలిగివుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీని కూడా తీసుకువస్తుంది. కాబట్టి, ఈ ఫోన్ ఈ ధరలో కంప్లీట్ ప్యాకేజ్ ఫోన్ గా మర్కెట్ లోకి వచ్చింది.

2. Infinix Hot 10s  (Buy Here)  

ప్రారంభ ధర: రూ.9,999

Infinix Hot 10s స్మార్ట్ ఫోన్ పెద్ద 6.82 -అంగుళాల HD + రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శ్యాంప్లింగ్ రేట్ గల డిస్ప్లేమరియు NEG Dinorex  గ్లాస్ ప్రొటక్షన్ తో అందించింది. ఈ ఫోన్ మీడియా టెక్  హీలియో G85 గేమింగ్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది మరియు 6GB RAM మరియు 64GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. అలాగే, ఈ ఫోన్ XOS  7.6 ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.ఇన్ఫినిక్స్ హాట్ 10s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని 48MP మైన్ సెన్సార్ తో అందించింది.  ఈ ఫోన్ పెద్ద 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంటుంది. ఆడియో పరంగా కూడా ఇందులో DTS Surround సౌండ్ ని కూడా అందించింది. ఓవరాల్ గా చెప్పాలంటే తక్కువ ధరలో మంచి ఫోన్ అందుకోవచ్చు.

3. Redmi Note 10 (Buy Here)

ప్రారంభ ధర: రూ.14,999

రెడ్మి నోట్ 10 స్మార్ట్ ఫోన్ 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ గల సూపర్ AMOLED డిస్ప్లే తో వుంటుంది.  ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  678 ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 611 GPU తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12 స్కిన్ పైన పనిచేస్తుంది. నోట్ 10 వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది, దీనిలో 48MP మైన్ కెమెరాని SonyIMX582 సెన్సార్ కి జతగా 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ లను జతచేసింది మరియు ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్ లోపల 13 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది.

4. Realme Narzo 30 (Buy Here)

ప్రారంభ ధర: రూ.13,499

Narzo 30 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.5 ఇంచ్ డిస్ప్లే ని FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G95 ప్రొసెసర్ తో పనిచేస్తుంది. ఇది ఆక్టా కోర్ CPU మరియు ARM Mali-G76 MC4 GPU తో ఉంటుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు తో వస్తుంది. ఇందులో 48MP మైన్ కెమెరా నైట్ స్కెప్ సపోర్ట్ తో వస్తుంది. ఈ కెమెరా EIS వీడియో స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తుంది మరియు ముందుభాగంలో, 16MP Samsung S5K3P9SP04 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 30 W డార్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితంగా Realme UI 2.0 స్కిన్ పైన పనిచేస్తుంది.

5. Redmi 10 Prime (Buy Here)

ప్రారంభ ధర: రూ.12,499

రెడ్‌మి 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్  6.5 ఇంచ్ Full-HD+ రిజల్యూషన్ డిస్ప్లే మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Helio G88 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. ఇది రీడింగ్ మోడ్ 3.0 తోవస్తుంది. ఈ ఫోన్ Android 11 ఆధారితంగా MIUI 12.5 స్కిన్ పైన పనిచేస్తుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా మరియు జతగా 8ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో మరియు డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. రెడ్‌మి 10 ప్రైమ్ ఫోన్ లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతునిచ్చే 6,000 బిగ్ బ్యాటరీ కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo