షావోమి ట్రిమ్మింగ్ మిషన్ వచ్చేస్తోంది

Updated on 25-Jun-2019
HIGHLIGHTS

మనకు నచ్చినట్లుగా ట్రిమ్ చేసుకోవడానికి సరిపడే విధంగా దీనిలో ప్రత్యకతలను ఆంధిచినట్లు తెలుస్తోంది

ముందుగా, స్మార్ట్ ఫోన్ల నుండి మొదలై పెట్టి ఒక్కొక్కటిగా తన ప్రొడక్టులను తీసుకొస్తోంది. మార్కెటింగ్ చేయడంలో దిట్టైన షావోమి, వినియోగదారులు ఎటువంటి వివరాలను కోరుకుంటారో అటువంటి ప్రత్యేకతలతో తన ప్రొడక్టులను తీసుకొస్తుంది కాబట్టి, వాటిని వినియోగదారులు ఎక్కువగా ఆధరించారని చెప్పొచ్చు.

ఇప్పుడు షావోమి యొక్క సొంత వెబ్ సైట్ అయినటువంటి, Mi.com పైన ఈ ట్రిమ్మింగ్ మిషన్ గురించి టీజింగును అందించింది. ఈ టీజింగ్ ప్రకారంగా, ఈరోజు  మధ్యాహ్నం 12 గంటలకి ఈ ట్రిమ్మింగ్ ప్రొడక్టును లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ టీజింగ్ ద్వారా, ఈ ప్రోడక్ట్ చూడడానికి ఎలా కనిపిస్తుంది అనేది  అర్ధమవుతుంది. కాని, దీనికి సంభందించిన పూర్తి వివరాలను మాత్రం వివరంచలేదు.

అయితే, మనకు నచ్చినట్లుగా ట్రిమ్ చేసుకోవడానికి సరిపడే విధంగా దీనిలో ప్రత్యకతలను ఆంధిచినట్లు తెలుస్తోంది, దీని గురించి క్యాప్షన్ గా " Engineered For  Perfection " అని అందించింది. అంటే, పరిపూర్ణత కోసం దీన్ని డిజన్ చేసినట్లుగా చెబుతోంది. అలాగే, ఈ టీజింగులో చూపించిన ఒక చిత్రంలో మనకు నచ్చిన పాయింట్స్ లో ట్రిమ్ చేసుకునేలా ఒక ఎంపిక బటన్ అంకదినట్లు కనబడుతోంది. ఇందులో, 1 పాయింట్ మొదలుకొని 10 పాయింట్ల వరకు సరిచేసుకునేలా కనిపిస్తుంది. ఇక పూర్తి వివరాల కోసం లాంచ్ వరకు వేచిచూడాల్సిందే.             

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :