మరోసారి ఫ్లాష్ సెల్ :నోకియా 6.1 ప్లస్, రూ .15,999 ధరతో అందుబాటులో ఉంటుంది

మరోసారి ఫ్లాష్ సెల్ :నోకియా 6.1 ప్లస్, రూ .15,999 ధరతో అందుబాటులో ఉంటుంది
HIGHLIGHTS

Flipkart నుండి మధ్యాహ్నం 12 గంటలకి, నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ రూ .15,999 ధరతో కొనుగోలు చేయగల ఫ్లాష్ సెల్ను ప్రారంభిస్తుంది.

నేడు, ఫ్లిప్కార్ట్ మళ్లీ నోకియా 6.1 ఫ్లాష్ సెల్ఫోన్నీ పరిచయం చేయనుంది, ఈ ఫోన్ సేల్ మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ ఫ్లాష్ సెల్ లో స్మార్ట్ఫోన్ స్టాక్ ఉన్నంత వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయి మరియు మీరు ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలనుకుంటే, సెల్ను ప్రారంభించే కొన్ని నిమిషాల ముందే ఆన్లైన్లో ఉండండి మరియు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ను ఉపయోగించండి.

నోకియా 6.1 ప్లస్ యొక్క ధరలు మరియు ఆఫర్లు

నోకియా 6.1 ప్లస్ ధర రూ .15,999 మరియు EMI పై హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు కొనుగోలుతో 5 శాతం డిస్కౌంట్  కూడా అందుబాటులో ఉంది. దీనితో పాటు, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ డివైజ్ని కొనుగోలు చేయటానికి 5% తగ్గింపును అందిస్తుంది.

నోకియా 6.1 ప్లస్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లు

ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్ప్లే నోకియా 6.1 ప్లస్లో ఇవ్వబడింది. ఈ ఫోన్లో ఒక 5.8 అంగుళాల FHD + (2280×1080) డిస్ప్లే ఉంది, ఇది19: 9 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంది మరియు అధిక స్క్రీన్-టు-బాడీ రేషియోను అందిస్తుంది. గొరిల్లా గ్లాస్ 3 డివైజ్ ముందు మరియు వెనుక భాగంలో ఉంచుతారు మరియు ఈ గ్లాసెస్ మిడ్నైట్ బ్లూ, గ్లాస్  బ్లాక్ మరియు గ్లాస్ వైట్ కలర్ లో అందుబాటులో ఉంటుంది.

నోకియా 6.1 ప్లస్ ఆక్టా కోర్ స్నాప్డ్రాగెన్ 636 చిప్సెట్, 4 జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 400 జీబికి పెంచుకోవడం లాంటి సౌకర్యాలనిస్తుంది. నోకియా 6.1 ప్లస్ కూడా ఒక Android One కలిగిన  డివైజ్, అనగా ఈ డివైజ్ భద్రతా అప్డేట్లను సమానుగుణంగా పొందుతుంది మరియు భవిష్యత్తులో డివైజ్ Android 9 Pie కి కూడా అప్డేట్ చేయబడుతుంది. నోకియా 6.1 ప్లస్ మరియు 5.1 ప్లస్ రెండూ Google లెన్స్తో వస్తాయి.

నోకియా 6.1 ప్లస్ వెనుక, 16 మరియు 5 మెగాపిక్సెల్ డ్యూయల్  కెమెరా ఇవ్వబడింది, అయితే 16 మెగాపిక్సెల్ కెమెరా డివైజ్ ముందు అందించబడింది మరియు దాని ఎపర్చరు f / 2.0 గ ఉంటుంది. కెమెరా కూడా AI మద్దతు ఇచ్చింది, ఇది చిత్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు బొకే ప్రభావాన్నిస్తుంది. ఈ ఫోన్  డ్యూయల్ సిమ్, 3,060mAh బ్యాటరీ కలిగి ఉంది, ఇది USB టైప్-సి ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo