ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకి Realme 2 Pro మొదటి సారిగా అమ్మకానికి రానుంది

HIGHLIGHTS

Realme 2 Pro సేల్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకి Realme 2 Pro అమ్మకానికి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకి Realme 2 Pro మొదటి సారిగా అమ్మకానికి రానుంది

ఈ రియల్ మి 2 ప్రో, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకి Realme 2 Pro అమ్మకానికి రానుంది. ఈ కొనాలని ఎదురు చుసున్నవారిలో మీరు ఒకరైతే, ఈ ఫోన్ గురించిన పూర్తి వివరాలు ఒకసారి చూసి మీకు నచ్చిన ఎంపికని ఎంచుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ధరలు

1. 4GB RAM మరియు 64GB నిల్వ – Rs. 13,990

2. 6GB RAM మరియు 64GB నిల్వ – Rs. 15,990

3. 8GB RAM మరియు 128GB నిల్వ – Rs. 17,990

flipkart exclusive

డిస్ప్లే వివరాలు

డిస్ప్లే : ఈ ఫోన్ 2340 x 1080 రిజల్యూషన్ గల ఫుల్ HD+ తో కూడిన ఒక 6.3 -అంగుళాల డిస్ప్లే కలిగివుంటుంది. డిస్ప్లే రకం: ఇది తాజా డ్యూ డ్రాప్ డిజైన్ తో ఉన్నIPS LCD తో వస్తుంది. డిస్ప్లే రక్షణ: గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ వివరాలతో, ఇది మంచి రక్షణగల మరియు మంచి క్లారిటీ అందించే ఒక పెద్ద డిస్ప్లే గా మనకి తెలుస్తుంది.  

పనితీరు వివరాలు

ప్రాసెసర్ : 1.95GHz క్లాక్ వేగం గల క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 AIE ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు  అడ్రినో 512 GPU       

ర్యామ్ : 4GB, 6GB మరియు  8GB 

స్టోరేజి : 64GB మరియు 128GB . అలాగే, మెమొరీ కార్డు ద్వారా 256GB వరకు పెంచుకోవచ్చు.

ప్రాసెసర్, ర్యామ్ మరియు స్టోరేజి విభాగంలో ఈ ధర పరిధిలో ఇవి తగినట్లుగానే ఉంటాయి. 

కెమేరా 

వెనుక కెమెరా    : దీని ప్రధాన కెమెరా గురించి చుస్తే, f /1.7 ఎపర్చరు గల 16MP కెమెరా మరియు f /2.4 ఎపర్చరు గల 2MP కెమెరా జతగా డ్యూయల్ కెమెరా ఉంటుంది.    

ముందు కెమెరా : దీని సెల్ఫీ కెమెరా, f /2.0 ఎపర్చరు గల ఒక 16MP కెమెరా ఉంటుంది.

బ్యాటరీ సామర్ధ్యం

ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3500mAh సామర్ధ్యం గల బ్యాటరీతో వస్తుంది. ఇది ఒక  5V 2A చార్జర్ తో వస్తుంది.

 కనెక్టవిటీ

ఈ ఫోన్లో డ్యూయల్ నానో సిమ్ కార్డులతో పాటుగా మైక్రో SD  కార్డుని కూడా ఒకే సరి వాడుకోవచ్చు.

USB రకం : మైక్రో -USB మరియు 3.5 ఆడియో జాక్ కలిగి ఉంటుంది.

OS సిస్టం

ఆండ్రాయిడ్ 8.1 ఓరెయో ఆధారిత కలర్ OS 5.2

బాక్స్ నుండి లభించేవి

హ్యాండ్సెట్, అడాప్టర్, మైక్రో USB కేబుల్, క్విక్ గైడ్, సిమ్ కార్డు టూల్, స్క్రీన్ ప్రొటెక్ట్ ఫీల్మ్ మరియు కేస్. వీటితో పాటుగా, వారంటీతో కార్డుతో కూడిన బుక్లెట్ కూడా ఉంటుందని సంస్థ నోట్ చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo