Redmi Go ఫ్లాష్ సేల్ … ఈరోజు మద్యాహ్నం 2 గంటలకి

Updated on 25-Mar-2019
HIGHLIGHTS

ఈ ఫోన్ ఒక స్నాప్ డ్రాగన్ 425 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పాటుగా ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తో వస్తుంది.

ఇటీవల, షావోమి అతి తక్కువ ధరతో ఇండియాలో విడుదల చేసినటువంటి, ఈ Redmi Go స్మార్ట్ ఫోన్ యొక్క మరొక ఫ్లాష్ సేల్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి mi.com మరియు Flipkart వంటి ఆన్లైన్ ఫ్లాట్ఫారాలలో జరగనుంది. ఈ స్మార్ట్ ఫోన్, గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ  ఫోన్ ఒక స్నాప్ డ్రాగన్ 425 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పాటుగా ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తో వస్తుంది.

Redmi Go ప్రత్యేకతలు 

ఈ ఫోన్  16: 9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లేలో, ఎగువ మరియు దిగువ భాగంలో మందపాటి అంచులు కలిగి ఉంటుంది మరియు ఈ డివైజ్ యొక్క వెనుకవైపు ఉన్న ఒక ఎడమ మూలలో సింగల్ కెమెరా మరియు ఫ్లాష్ మాడ్యూల్ ఉన్నాయి. ఈ రెడ్మి గో 1280x720p రిజల్యూషను అందించగల, ఒక 5-అంగుళాల LCD HD డిస్ప్లేని కలిగి ఉంటుంది, ఇది క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 425 SoC తో నడుస్తుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు పెంచుకునేలా,  8GB మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజికి జతగా 1 జీబి ర్యామ్ తో  ఈ హ్యాండ్ సెట్ లభిస్తుంది. ఈ ఫోన్ రూ.4,499 రూపాయల ధరతో అందుబాటులో ఉంటుంది.  

ఆప్టిక్స్ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక 8MP ఒకే వెనుక కెమెరాతో f / 2.0 ఎపర్చరు మరియు 1.12μm పిక్సెల్ పరిమాణంతో వస్తుంది. ముందు, ఇది ఒక 5MP సెన్సారుని కలిగివుంది.  ఇది 1.12μm పిక్సెల్ పరిమాణం మరియు ఒక f / 2/2 ఎపర్చరుతో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్) ద్వారా నడిచే  ఈ హ్యాండ్సెట్, ఒక 3000 mAh బ్యాటరీ, మైక్రోUSB ఛార్జింగ్ పోర్టులతో వస్తుంది. ఈ ఫోన్ బ్లాక్ మరియు బ్లూ కలర్ రకాలు మరియు డ్యూయల్ సిమ్ మద్దత్తుతో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, 20 కి పైగా భారతీయ భాషలను కలిగివుంటుంది మరియు ప్రత్యేకంగా హిందీ భాషలో "Google Assistance" ని కూడా కలిగివుంటుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :