పంచ్ హోల్ సెల్ఫీ +48MP డ్యూయల్ కేమేరాతో ఈరోజు లాంచ్ కానున్న Moto One Vision

Updated on 20-Jun-2019
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో విడుదలకానుంది.

ఒక ప్రత్యేకమైన పేజీని Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అందించింది.

మోటో వన్ విజన్ ఇండియాలో లాంచ్ గురించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇటీవల, మోటరోలా బ్రెజిల్లో తాజాగా విడుదల చేసినటువంటి  స్మార్ట్ ఫోన్ అయిన, మోటో వన్ విజన్ ఇప్పుడు ఇండియాలో విడుదలకు సిద్ధం అయ్యింది. ముందుగా బ్రెజిల్లో ప్రారంభించిన ఈ స్మార్ట్ ఫోన్, ఒక పంచ్ హోల్ డిస్ప్లే సెల్ఫీ  కెమెరా మరియు వెనుక ఒక 48MP ప్రధాన కెమేరా వాటి ప్రత్యేకలతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి  ఇండియాలో విడుదలకానుంది.దీని సంబంచి ఒక ప్రత్యేకమైన పేజీని Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అందించింది.    

Moto One Vision ప్రత్యేకతలు ( బ్రెజిల్ )

 ఈ స్మార్ట్ ఫోన్ 6.3-అంగుళాల LCD ప్యానెల్ మరియు HD + రిజల్యూషన్తో వస్తుంది.  ఒక  Exynos 9609 చిప్సెట్టుతో ఇది పనిచేస్తుంది. అయితే కేవలం 4GB RAM మరియు 128GB స్టోరేజి కలిగిన ఒకే ఒక్క వేరియంటుతో మాత్రమే  ఈ ఫోన్ను విడుదల చేసింది. అదనంగా, ఈ ఫోన్ మంచి  డైజైన్ తో ప్రవేశపెట్టబడింది. ఇందులో మీరు 21: 9 ఆస్పెక్ట్ రేషియోని పొందుతారు. అలాగే,  ఈ మోటో వన్ విజన్ యొక్క కెమెరా విభాగం గురించి మాట్లాడినట్లయితే, ఇందులో డ్యూయల్  కెమెరా సెటప్ ఇచ్చారు.

ఇందులో ఒక  48 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరా సెన్సార్ ఉంది, ఇది f / 1.7 ఎపర్చరు కలిగిన ఒక 48MP కెమెరాతో వస్తుంది. మోటోరోలా నుండి ఒక 48MP కెమేరాతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా ఇది నిలుస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా,  ఒక 5 MP సెకండ్ కెమేరాని డెప్త్ సెన్సింగ్ కోసం అందించారు. ఇది OIS కు మద్దతు ఇస్తుంది మరియు ఇందులో నైట్ టైం లో మంచి ఫోటోలను తీసుకునేలా,  నైట్ వ్యూ మోడ్నికూడా  అందుకుంటారు. ఈ స్మార్ట్ ఫోనులో, సెల్ఫీల కోసం 25-మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వబడింది. ఈ స్మార్ట్ ఫోన్  ఆండ్రాయిడ్ 9 పై OS, స్టాక్ ఎక్స్పీరియన్సుతో వస్తుంది. ఇది ఒక 15W టర్బోపవర్ ఛార్జింగ్ మద్దత్తు కలిగిన 3,500mAh బ్యాటరీతో వస్తుంది.

అయితే, ఇండియాలో విడుదల సమయంలో ఎటువంటి స్పెక్స్ అందిస్తుందో వేచి చూడాల్సిందే.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :