Google Play Store లో రీ ఎంట్రీ ఇచ్చిన TikTok

Google Play Store లో రీ ఎంట్రీ ఇచ్చిన TikTok
HIGHLIGHTS

ఈ ఆప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకునేందుకు మరలా తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది.

ముందుగా, యువతను పెడదారిన తీసుకెళుతొందన్న నినాదంతో ముందుకు వచినటువంటి, తమిళనాడు రాష్ట్ర విన్నతిని స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం యొక్క నిర్ణయానికి మద్దతుగా గూగుల్ తన ప్లే స్టోర్ నుండి ఈ ఆప్ ని బ్లాక్ చేసింది . అయితే, ఎటువంటి అంశాలయితే ఉండకూడదని మద్రాస్ హై కోర్ట్ సూచించిందో, అటువంటి వాటిని తొలగించడంతో పాటుగా, ఇక నుండి అప్లోడ్ చేసే అవకాశాన్ని పూర్తిగా నియంత్రించడం వలన, మద్రాస్ హై కోర్ట్  దీని పైన విధించిన నిషేధాన్ని ఎత్తి వేసినట్లు ప్రకటించింది.

అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి TikTok ని గూగుల్ ప్లే స్టోర్ నుండి బ్లాక్ చేసింది. అయితే, ఇప్పుడు మరలా దీనిమీద విధించిన నిషేధాన్ని ఎత్తివేయడం వలన తిరిగి ఈ ఆప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకునేందుకు మరలా తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం ఎదురుచూస్తున్న వారికీ ఇది నిజంగా ఒక మంచి వార్త అని చెప్పొచ్చు. కానీ, దీన్ని నిలిపివేయాలని చేస్తున్నవారికి, కొంచం బాధని మిగిలించింది.  

అయితే, ఇప్పుడు  న్యూడ్ లేదా అసభ్యకరమైన విధంగా వుండే మరియు అభ్యంతకరమైన వీడియోలను, ఇందులో అప్లోడ్ చేసే వీలులేకుండా TikTok ని సరిచేసినట్లు దీని యొక్క యజమాని అయినటువంటి 'బైట్ డాన్స్' పేర్కొన్నారు. కాబట్టి , ఇక నుండి అశ్లీలతను ప్రోత్సహించే విధంగా ఈ ఆప్ ఉండదు. ఇది కొంత ఊరటనిచ్చే విషయమే అవుతుంది.                    

TikTok  ప్లాట్ఫారం నుండి లభించే అనేకమైన పాటలు మరియు మాటలకు సరిపడునట్లు లిప్ సింక్ చేసి, సరదా వీడియోలను క్రియేట్ చెయ్యడం వంటి లక్ష్యంతో వచ్చినటువంటి ఈ చైనీయ ఆప్, భారతదేశంలోని యువతను ఎక్కువగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వున్నా వినియోగదారుల్లో 35 కంటే అధిక శాతం వినియోగదారులు మన భారతీయులే కావడం విశేషం. ఇది అంతగా నాటుకుపోయింది మనదేశంలో.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo