ఆండ్రాయిడ్ 10 అందుకోనున్న REALME స్మార్ట్ ఫోన్లు

ఆండ్రాయిడ్ 10 అందుకోనున్న REALME స్మార్ట్ ఫోన్లు
HIGHLIGHTS

రియల్మీ ఇప్పుడు తన పాత స్మార్ట్‌ ఫోన్లకు ప్రధాన అప్డేట్ అయినటువంటి, ఆండ్రాయిడ్ 10 కి అప్‌ డేట్ చేసే పనిలో ఉంది

రియల్మీ,  ఇప్పుడు తన స్మార్ట్ ఫోన్ల కోసం కొత్త అప్డేట్ అయినటువంటి ఆండ్రాయిడ్ 10 కోసం రోడ్‌మ్యాప్‌ ను ప్రకటించింది. రియల్మి ఎక్స్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ రియల్మీ సంస్థ యొక్క ఫ్లాగ్ షిప్ డివైజ్ గా,  ఈ నెలలో చైనాలో రియల్మి ఎక్స్ 2 తో పాటు లాంచ్ చేయబడింది, ఇది ప్రాథమికంగా స్నాప్‌డ్రాగన్ 730 G చిప్‌ సెట్ మరియు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ ఫోన్లను నవంబర్ 20 న భారత్‌లో విడుదల చేయనున్నారు.

అయితే ఆశ్చర్యకరంగా, రియల్మీ ఇప్పుడు తన పాత స్మార్ట్‌ ఫోన్లకు ప్రధాన అప్డేట్ అయినటువంటి, ఆండ్రాయిడ్ 10 కి అప్‌ డేట్ చేసే పనిలో ఉంది. ఈ అప్‌డేట్ రియల్మి 2 ప్రో నుండి రియల్మి ఎక్స్ 2 ప్రో వరకు పలు రకాల స్మార్ట్‌ ఫోన్లకు అందుబాటులోకి తేనుంది . వీటిలో, రియల్మీ 3 ప్రో, రియల్మి X, రియల్మి 5 ప్రో, రియల్మి ఎక్స్‌టి  వంటి స్మార్ట్ ఫోన్లు 2020 Q 1 లో ఆండ్రాయిడ్ 10 కి అప్‌డేట్ అవుతాయి. దీనికి విరుద్ధంగా, రియల్మి 5 కి మాత్రం 2020 Q 2 లో ఆండ్రాయిడ్ 10 అప్‌ డేట్ లభిస్తుండగా, రియల్మి 2 ప్రో ఫోనులో మాత్రం 2020 Q 3 లో ఆండ్రాయిడ్ 10 రన్ చేయడానికి ప్లాన్ చేయబడింది .

realme android 10 update.jpg

రియల్మీఎక్స్‌ 2, రియల్మీ ఎక్స్‌ 2 ప్రో ఇంకా భారత్‌లో లాంచ్ కానప్పటికీ, ఈ స్మార్ట్‌ ఫోనులు 2020 Q 2 లో చైనాలో ఆండ్రాయిడ్ 10 కి అప్‌డేట్ అవుతాయి. గ్లోబల్ రోల్అవుట్ త్వరలోనే వెల్లడించవచ్చు.

ఈ ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ఫోన్, రియల్మీ ఎక్స్ 2 ప్రో, ఒక 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది మరియు 2400 x 1080 రిజల్యూషన్ కలిగి ఉంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855+ చిప్‌ సెట్‌తో పనిచేస్తుంది, ఇది అడ్రినో 640 GPU తో జత చేయబడింది. ఈ ఫోన్ యొక్క బేస్ వేరియంట్లో 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ ఉన్నాయి.

ఆప్టిక్స్ పరంగా, ఈ రియల్మీ ఎక్స్ 2 ప్రో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది: f / 1.8 ఎపర్చర్‌తో 64 MP సెన్సార్ + f / 2.4 ఎపర్చర్‌తో 13 MP టెలిఫోటో సెన్సార్ + f / 2.3 ఎపర్చర్‌తో 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ +  f / 2.4 ఎపర్చర్‌తో 2MP డెప్త్ సెన్సార్ తో ఉంటుంది. ఇక ముందుభాగంలో ఒక 32 MP సెల్ఫీ షూటర్ కూడా ఉంది.

రియల్మీ ఎక్స్ 2 ప్రో Dolby Atmos – ఎనేబుల్డ్ స్టీరియో స్పీకర్లు మరియు బ్లూటూత్ 5.0 ను కలిగి ఉంది. ఇది 50W సూపర్‌వూక్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీకి మద్దతు ఇచ్చే 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo