బడ్జెట్ ధరలో వచ్చిన 3GB ర్యామ్ స్మార్ట్ ఫోన్ పైన ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

అతి తక్కువ ధరలో 3GB ర్యామ్ ఫోన్

రూ.6,999 ధరలో లేటెస్ట్ వచ్చిన Tecno Spark GO 2023

ఈ ఫోన్ 3GB ర్యామ్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది

బడ్జెట్ ధరలో వచ్చిన 3GB ర్యామ్ స్మార్ట్ ఫోన్ పైన ఒక లుక్కేయండి.!

అతి తక్కువ ధరలో 3GB ర్యామ్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే రూ.6,999 ధరలో లేటెస్ట్ వచ్చిన Tecno Spark GO 2023 స్మార్ట్ ఫోన్ ను ఒకసారి పరిశీలించండి. ఎందుకంటే,  ఈ ఫోన్ 3GB ర్యామ్, 13MP కెమేరా వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. మరి ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఎలా ఉన్నదో చూద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Tecno Spark GO 2023: ధర 

టెక్నో స్పార్క్ గో 2023 స్మార్ ఫోన్ ను 3GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజ్ తో రూ.6,999 లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఎండ్ లెస్ బ్లాక్, యూయిని బ్లూ మరియు నెబ్యులా పర్పల్ అనే మూడు కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ అన్ని ప్రధాన రిటైల్ స్టోర్ లలో లభిస్తుంది.   

Tecno Spark GO 2023: స్పెక్స్

టెక్నో స్పార్క్ గో 2023 స్మార్ ఫోన్ పెద్ద 6.5 ఇంచ్ డిస్ప్లేని HD+ రిజల్యూషన్ తో కలిగి వుంటుంది. ఈ డిస్ప్లే 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 480నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 90% స్క్రీన్ టూ బాడీ రేషియోతో వస్తుంది. ఈ ఫోన్ మీడియా టెక్ బడ్జెట్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ Helio A22 తో పనిచేస్తుంది. దీనికి జతగా, 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ టి ఉంటుంది. 

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ వెనుక AI డ్యూయల్ కెమేరా వుంది. ఇందులో 13MP ప్రైమరీ కెమేరా జతగా మరొక కెమేరా వుంది. ముందు భాగంలో, 5MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారితంగా HiOS సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ టైప్-C  ఛార్జింగ్ పోర్ట్ తో పెద్ద 5000 mAh బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo