Tecno Pova 6 Pro: డిఫరెంట్ డిజైన్ మరియు 24GB RAM తో వస్తోంది.!

Tecno Pova 6 Pro: డిఫరెంట్ డిజైన్ మరియు 24GB RAM తో వస్తోంది.!
HIGHLIGHTS

టెక్నో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంఛ్ గురించి భారీగా టీజింగ్ చేస్తోంది

Tecno Pova 6 Pro ఫోన్ ను 24GB RAM ఫీచర్ తో వస్తోంది

ఈ ఫోన్ వెనుక భాగంలో 100+ కస్టమ్ సెట్టింగ్స్ కలిగిన 210 Mini LED ని అందించింది

Tecno Pova 6 Pro: టెక్నో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంఛ్ గురించి భారీగా టీజింగ్ చేస్తోంది. టెక్నో పోవా 6 ప్రో స్మార్ట్ ఫోన్ ను డిఫరెంట్ డిజైన్ మరియు 24GB RAM ఫీచర్ తో తీసుకు వస్తున్నట్లు ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది. ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి టెక్నో కొత్త విషయాలను ఈరోజు వెల్లడించింది. ఈ టెక్నో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది. ఎలాంటి ఫ్యూచర్ లతో లంచ్ అవుతుందో చూద్దామా.

Tecno Pova 6 Pro ఎప్పుడు లాంఛ్ అవుతుంది?

ఈ టెక్నో అప్కమింగ్ ఫోన్ మార్చి 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదలవుతుంది. ఈ టెక్నో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకువస్తుంది. అందుకే, అమెజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రోసైట్ పేజ్ ను కూడా అందించింది. అంతేకాదు, ఈ మైక్రో సైట్ నుండి టెక్నో లాంచ్ చేయబోతున్న పోవా 6 ప్రో కీలకమైన వివరాలను అందించింది.

టెక్నో పోవా 6 ప్రో డిజైన్ ఎలా వుంది?

ఈ టెక్నో అప్ కమింగ్ ఫోన్ అప్డేటెడ్ ఇంటర్ ఫేజ్ డిజైన్ తో వస్తోంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 100+ కస్టమ్ సెట్టింగ్స్ కలిగిన 210 Mini LED ని అందించింది. ఈ లైట్ తో ఈఫోన్ చాలా ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది.

Tecno Pova 6 Pro Design
Tecno Pova 6 Pro Design

ఈ మినీ ఎల్ఈడి గేమ్ కాల్ నోటిఫికేషన్ వంటి వచ్చినప్పుడు వెలుగుతుంది. అంతేకాదు, మరిన్ని ఫీచర్లు ఈ లైట్ తో జోడించినట్లు కంపెనీ చెబుతోంది.

Also Read: టెస్టింగ్ లో 16 Gbps స్పీడ్ నమోదు చేసిన 5G నెట్ వర్క్.. ఇదేం స్పీడ్ రా బాబు.!

టెక్నో పోవా 6 ప్రో ఫీచర్స్ ఎలా ఉన్నాయి?

టెక్నో పోవా 6 ప్రో ఫీచర్స్ యొక్క కొన్ని కీలకమైన ఫీచర్స్ ను కంపెనీ వెల్లడించింది. ఈ ఫీచర్లను చూస్తుంటే, ఈ ఫోన్ భారీ వివరాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్లు 12GB ఫిజికల్ రామ్ మరియు 12GB ఎక్స్ ప్యాండబుల్ RAM తో కలిపి టోటల్ 24GB RAM ఫీచర్ తో తీసుకు వస్తునట్లు తెలిపింది.

ఈ ఫోన్ లో 8GB RAM + 8GB ఎక్స్ ప్యాండబుల్ RAM వేరియంట్ ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు నీ ఫోన్లో ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నట్లు కూడా తెలిపింది. ఈ ఫోన్లో అద్భుతమైన డిస్ప్లేన్ ఇచ్చినట్లు కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 10 AMOLED స్క్రీన్ ను 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ తో కలిగి ఉన్నట్లు కూడా తెలిపింది.

Tecno Pova 6 Pro
Tecno Pova 6 Pro

70W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ టెక్ సపోర్ట్ కలిగి 6000 mAh బ్యాటరీని కలిగిన మొదటి ఫోన్ గా టెక్నో పోవా 6 ప్రో నిలుస్తుందని టెక్నో వివరించింది.

ఈ ఫోన్ ను మరింత ప్రీమియం మరియు ఆకర్షణీయంగా కన్పించేలా చేయడానికి Dynamic Port 2.0 ఫీచర్ కూడా జత చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లో Hi-Res Audio మరియు Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

ఈ ఫోన్ కెమేరా పరంగా కూడా గొప్పగానే కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్ లో 108MP + 2MP + AI లెన్స్ ట్రిపుల్ రియర్ మరియు 32MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo