రూ. 14,999 ధరలో పవర్ ఫుల్ 5G స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేసిన టెక్నో.!

HIGHLIGHTS

ఇండియన్ మార్కెట్ లో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టింది

టెక్నో పోవా 5 ప్రో స్మార్ట్ ఫోన్ ను రూ. 14,999 రూపాయల ప్రారంభ ధరతో టెక్నో లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ఆగష్టు 22 నుండి అమేజాన్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది

ఇండియన్ మార్కెట్ లో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టింది. అదే, టెక్నో ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన పవర్ ఫుల్ 5G స్మార్ట్ ఫోన్ Tecno Pova 5 Pro. ఈ స్మార్ట్ ఫోన్ ను టెక్నో కేవలం రూ. 14,999 ధరలో వెనుక RGB లైట్స్, 5G ప్రోసెసర్, డ్యూయల్ 5G సపోర్ట్ తో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన స్పెక్స్ మరియు ఫీచర్లతో లాంచ్  చేసింది. త్వరలో సేల్ కి అందుబాటులోకి రానున్న ఈ కొత్త స్మార్ట్ ఫోన్ విశేషాలు తెలుసుకోండి. 

Tecno Pova 5 Pro: ధర

టెక్నో పోవా 5 ప్రో స్మార్ట్ ఫోన్ ను రూ. 14,999 రూపాయల ప్రారంభ ధరతో టెక్నో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆగష్టు 22 నుండి అమేజాన్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. 

Tecno Pova 5 Pro: స్పెక్స్ & ఫీచర్స్

టెక్నో యొక్క ఈ లెట్స్ స్మార్ట్ ఫోన్ పెద్ద 6. 7 ఇంచ్ FHD+ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు డాట్ ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమేరాతో కలిగి వుంది. ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ 5G చిప్ సెట్ Dimensity 6080 శక్తితో పని చేస్తుంది. అంతేకాదు, ఈ పవర్ ఫుల్ ప్రోసెసర్ కి సపోర్ట్ గా 8GB ర్యామ్ మరియు 256GB వరకు హెవీ స్టోరేజ్ తో వస్తుంది.

ఈ లేటెస్ట్ టెక్నో స్మార్ట్ ఫోన్ వెనుక ప్రీమియం ఫోన్ లలో మాత్రమే కనిపించే RGB లైట్ సెటప్ అందించబడింది మరియు ఇది ఈ ఫోన్ ను ప్రీమియం ఫోన్ల సరసన కూర్చోబెట్టేలా చేసింది. అంతేకాదు, చాలా ఆకర్షణీయమైన బ్యాంక్ ప్యానల్ డిజైన్ కూడా ఈ ఫోన్ సొంతం. 

ఈ ఫోన్ కెమేరా వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ కెమేరా సెటప్ వుంది మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరాని ఫ్లాష్ తో పాటుగా కలిగి వుంది. 

ఈ ఫోన్ ఛార్జ్ టెక్ మరియు బ్యాటరీ విభాగంలో కూడా ఈ ఫోన్ చక్కగా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ 68W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీని కలిగి వుంది. ఈ బడ్జెట్ కేటగిరిలో ఈ ఫీచర్ కలిగిన ఫస్ట్ ఫోన్ ఇదే అవుతుంది, అని కంపెనీ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :