Lava Virat Curve launching with new design and features
Lava Virat Curve: మార్కెట్ ను షేక్ చేసే కొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్ చేయనున్నట్లు లావా అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ చూడగానే ఆకట్టుకునే కొత్త డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ చూసిన వెంటనే అర్ధం అవుతుంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ అందించిన టీజర్ పీజీ ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా వెల్లడించింది. ఈ ఫోన్ Sony కెమెరా మరియు 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అవుతున్నట్లు లావా కన్ఫర్మ్ చేసింది.
లావా విరాట్ కర్వ్ స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు లావా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను కూడా ఫ్లిప్ కార్ట్ నుంచి లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అంటే, ఈ ఫోన్ కోసం లావా పార్ట్నర్ గా ఉంటుంది.
లావా విరాట్ కర్వ్ స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకమైన మినీ డిస్ప్లేని ఈ ఫోన్ లో పరిచయం చేసింది. ఇది ఫోన్ వెనుక కెమెరా క్రింద ఉంటుంది. ఇది లోగో, వాల్యూమ్, బ్యాటరీ, నోటిఫికేషన్, ఎమోజిస్ మరియు టైం వంటి చాలా వివరాలు ఈ ఇన్ని స్క్రీన్ లో డిస్ప్లే అవుతాయి. ఈ ఫోన్ ను ప్రీమియం క్వాలిటీ అండ్ ఫీల్ అందించే వేగాన్ లెథర్ తో ఉంటుంది.
ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ 3D Curved AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, FHD + రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7100 5జి చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. అలాగే, 6GB ఫిజికల్ అండ్ 6GB వర్చువల్ ర్యామ్ తో టోటల్ 12GB ర్యామ్ తో పాటు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 16 తో లాంచ్ అవుతుంది.
Also Read: 5.2 Dolby సౌండ్ బార్ ని అతి చవక EMI తో అతి చవక ధరలో అందుకోండి.!
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక 50MP Sony IMX 752 మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది 2K వీడియో రికార్డింగ్, 10x డిజిటల్ జూమ్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇందులో డ్యూయల్ మైక్ అండ్ డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ MIL-STD మిలటరీ గ్రేడ్ డ్యూరాబిలిటీ మరియు IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది.