5.2 Dolby సౌండ్ బార్ ని అతి చవక EMI తో అతి చవక ధరలో అందుకోండి.!

HIGHLIGHTS

గతంతో పోలిస్తే ఇండియన్ మార్కెట్లో సౌండ్ బార్ ధరలు చాలా ఘోరంగా తగ్గిపోయాయి

ప్రముఖ బ్రాండ్ అందించిన సౌండ్ బార్లు సైతం చాలా చవక ధరలో అందుబాటులోకి వచ్చాయి

5.2 Dolby సౌండ్ బార్ ఈరోజు అతి చవక EMI తో అతి చవక ధరలో అందుబాటులో ఉంది

గతంతో పోలిస్తే ఇండియన్ మార్కెట్లో సౌండ్ బార్ ధరలు చాలా ఘోరంగా తగ్గిపోయాయి. మారిన కాలం, పెరిగిన టెక్నాలజీ మరియు మార్కెట్ లో పెరిగిన కాంపిటీషన్ తో ప్రముఖ బ్రాండ్ అందించిన సౌండ్ బార్లు సైతం చాలా చవక ధరలో అందుబాటులోకి వచ్చాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అని అనుకుంటున్నారా? ఈరోజు లభిస్తున్న ఒక బడ్జెట్ బడ్జెట్ సౌండ్ బార్ ఆఫర్ ను చూసి, ఇందంతా గుర్తుకు చేసాము. అదేమిటంటే, రీసెంట్ గా విడుదలైన 5.2 Dolby సౌండ్ బార్ ఈరోజు అతి చవక EMI తో అతి చవక ధరలో అందుబాటులో ఉంది. అందుకే, వినాయక చవితి రోజు అందుబాటులో ఉన్న ఈ బిగ్ డీల్ ని ప్రత్యేకంగా అందించాము.

5.2 Dolby సౌండ్ బార్ ఆఫర్

GOVO రీసెంట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన GO SURROUND 888 సౌండ్ బార్ ఈరోజు మంచి ఆఫర్స్ తో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ గా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ మీకు ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇక ఆఫర్ విషయానికి వస్తే, రూ. 11,999 ప్రైస్ ట్యాగ్ 2025 లో గోవో విడుదల చేసిన ఈ 5.2 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ ఈ రోజు రూ. 4,500 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,499 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై మాంచి EMI ఆఫర్లు కూడా ఫ్లిప్ కార్ట్ జత చేసింది. ఈ సౌండ్ బార్ ని ICICI, ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు ఆప్షన్ తో కేవలం మూడు నెలలు రూ. 2,567 చెల్లిస్తే చాలు ఈ సౌండ్ బార్ మీ సొంతం అవుతుంది. ఒకవేళ మీరు Bajaj EMI కార్డు తో కొనాలనుకుంటే కేవలం నెలకు రూ. 1,250 రూపాయల చొప్పున 6 నెలలు చెల్లిస్తే చలి ఈ సౌండ్ బార్ మీ సొంతం అవుతుంది.

Also Read: వినాయక చవితి స్పెషల్: క్రియేటివ్ గణపతి బప్పా ఇమేజ్ క్రియేషన్ కోసం బెస్ట్ AI Image prompts తెలుగులో అందించాము.!

5.2 Dolby సౌండ్ బార్ ఫీచర్స్

ఇది గోవో అందించిన డ్యూయల్ సబ్ ఉఫర్ తో వచ్చే 5.2 ఛానల్ సౌండ్ బార్. ఇందులో మూడు ఫ్రంట్ స్పీకర్ కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ సెటప్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ పూర్తిగా వైర్డ్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ సెటప్ తో 625W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఆకట్టుకునే డిజైన్ మరియు కలర్ తో వస్తుంది.

ఈ గోవో సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజి సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్ మరియు స్పీకర్ సెటప్ తో మంచి సరౌండ్ సౌండ్ తో మీ స్మార్ట్ టీవీ అనుభూతిని మరింత పెంచుతుంది. ఇది మంచి మ్యూజిక్ అందిస్తుంది మరియు బడ్జెట్ ధరలో మీకు మంచి సౌండ్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో HDMI Arc, బ్లూటూత్, ఆప్టికల్ మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :