వినాయక చవితి స్పెషల్: క్రియేటివ్ గణపతి బప్పా ఇమేజ్ క్రియేషన్ కోసం బెస్ట్ AI Image prompts తెలుగులో అందించాము.!

HIGHLIGHTS

వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో కూడా గణనాథుడి సందడి కనిపిస్తుంది

ఏఐ సహాయంతో మీ క్రియేటివిటీ జోడించి గణపతి బప్పా ని మరింత ఆకర్షణీయంగా క్రియేట్ చేయవచ్చు

ఇమేజ్ క్రియేషన్ బెస్ట్ AI Image prompts ను ఈ రోజు ప్రత్యేకంగా అందించాము

వినాయక చవితి స్పెషల్: వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో కూడా గణనాథుడి సందడి కనిపిస్తుంది. ఈ పండుగను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు ప్రస్తుతం AI ఇమేజ్ జనరేషన్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. ఏఐ సహాయంతో మీ క్రియేటివిటీ జోడించి గణపతి బప్పా ని మరింత ఆకర్షణీయంగా క్రియేట్ చేయవచ్చు. అందుకే, ఇమేజ్ క్రియేషన్ బెస్ట్ AI Image prompts ను ఈ రోజు ప్రత్యేకంగా అందిస్తున్నాను. సెప్టెంబర్ 14వ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా స్టేటస్ కోసం మరియు ఇష్టమైన వారికి విషెస్ తెలియ చేయడానికి మరియు ఫోన్ లో డిస్ప్లే ఇమేజ్ గా సెట్ చేసుకోవడానికి కూడా ఈ క్రియేటివ్ ఇమేజ్ చక్కగా ఉంటుంది.

వినాయక చవితి స్పెషల్ : AI Image prompts

సోషల్ మీడియాలో షేర్ చేయడానికి, వాట్సాప్ స్టేటస్ కోసం, వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపే పోస్టర్ల కోసం ఈ AI చిత్రాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే మంచి రిజల్ట్ పొందాలంటే AI కి ఇచ్చే ప్రాంప్ట్ మరింత స్పష్టంగా మరియు వివరంగా ఉండాలి. మీరు ఈ ఇక్కడ అందించిన ప్రాంప్ట్ లను Chat GPT ఇమేజ్, గూగుల్ జెమినీ నానో బనానా మిడ్ జర్నీ వంటి ఇమేజ్ క్రియేషన్ ఏఐ ప్లాట్ ఫామ్ ద్వారా ఇమేజ్ లను క్రియేట్ చేయవచ్చు. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యేలా ఉండడానికి వీలుగా ప్రాంప్ట్ లను తెలుగులో అందించాను.

రాయల్ గణపతి ఇమేజ్ ప్రాంప్ట్

“అందంగా అలంకరించిన బంగారు సింహాసనంపై ఆసీనుడై, సుందరమైన సాంప్రదాయ కిరీటం మరియు ఆభరణాలు ధరించి, చుట్టూ తాజా పువ్వులు, వెలుగుతున్న నూనె దీపాలు మరియు ఒక గొప్ప పండుగ వాతావరణంతో ఉన్న గంభీరమైన మరియు దివ్యమైన గణేశుని విగ్రహాన్ని సృష్టించండి. ఇందులో ప్రశాంతమైన మరియు దివ్యమైన ముఖ భావాలు, వాస్తవిక వివరాలు, వెచ్చని బంగారు కాంతి, గొప్ప సాంప్రదాయ భారతీయ అలంకరణ, సినిమాటిక్ కంపోజిషన్, అత్యంత వాస్తవికమైన, అధిక వివరాలతో కూడిన, 8K రిజల్యూషన్, భక్తి పూర్వక వాతావరణం ఉండాలి.”

ఈ ప్రాంప్ట్‌తో రాజసంగా మరియు ప్రసన్నమైన గణపతి బప్పా చిత్రాన్ని రూపొందించుకోవచ్చు. అలాగే, ఇదే ఇమేజ్ ప్రాంప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేసుకొని మీకు ఇష్టమైన మరియు మీ సొంత క్రియేటివ్ ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు.

Also Read: Sony Dolby సౌండ్ బార్ భారీ కూపన్ ఆఫర్ తో చవక ధరలో సేల్ అవుతోంది .. డీల్ మిస్ చేసుకోకండి.!

పూలతో అలంకరించిన గణపతి

“రంగు రంగుల బంతిపూలు, మల్లెపూలు మరియు గులాబీ పువ్వులు, సంప్రదాయ భారతీయ అలంకరణ, మెరుస్తున్న దీపాలు, మృదువైన వెచ్చని లైటింగ్, ప్రశాంతమైన భక్తి వాతావరణం, క్లిష్టమైన ఆభరణాలు, వాస్తవిక అల్లికలు, సొగసైన కాంపొజిషన్, ఫోటో రియలిస్టిక్, అల్ట్రా డిటైల్డ్, 8K వంటి అంశాలతో అందమైన గణేశ విగ్రహాన్ని రూపొందించు.”

ఇంట్లో వినాయక పూజ

“వినాయక చవితి వేడుకల సమయంలో, సాంప్రదాయ పూజా వేదిక పై అందంగా అలంకరించిన గణేశుని విగ్రహం చుట్టూ పువ్వులు, దీపాలు, మామిడి ఆకులు, మోదకాలు, పండ్లు మరియు పండుగ అలంకరణలతో కూడిన ఒక వాస్తవిక భారతీయ ఇంటిని సృష్టించు. ఇందులో వెచ్చని సాయంకాలపు వెలుగులు, ప్రామాణికమైన భారతీయ గృహ వాతావరణం, ఆధ్యాత్మిక మరియు ప్రశాంతమైన భావన, సినిమాటిక్ ఫోటోగ్రఫీ, అత్యంత వివరంగా మరియు ఫోటో రియలిస్టిక్ తో 8K లో అందించు.”

ఈ ప్రాంప్ట్‌ తో ఇంట్లో వినాయక చవితి పూజ జరుగుతున్నట్లు సహజమైన చిత్రం పొందవచ్చు. ఇక్కడ పూజలో మీరు కూర్చున్నట్లు ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటే, జస్ట్ మీ ఫోటోలు అప్‌లోడ్ చేసి ఈ ప్రాంప్ట్ అందిస్తే మీరు వినాయక చవితి పూజ చేసినట్లు ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :