Tecno Pova 3: అతి తక్కువ ధరలో 7000 mAh బ్యాటరీతో సహా భారీ ఫీచర్లతో వచ్చింది!

HIGHLIGHTS

Tecno Pova 3 అతితక్కువ ధరలో లాంచ్ చేసింది

7000 mAh పెద్ద బ్యాటరీతో సహా భారీ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్ట్టింది

ఈ ఫోన్ 14 గంటల గేమింగ్ సమయాన్ని అందిస్తుందని కూడా టెక్నో పేర్కొంది

Tecno Pova 3: అతి తక్కువ ధరలో 7000 mAh బ్యాటరీతో సహా భారీ ఫీచర్లతో వచ్చింది!

ముందునుండి అనుకునట్లుగానే టెక్నో తన లేటెస్ట్ ఫోన్ Tecno Pova 3 ను అతితక్కువ ధరలో లాంచ్ చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ 7000 mAh పెద్ద బ్యాటరీతో సహా భారీ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్ట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్, కెమెరా మరియు ప్రాసెసర్ వంటివి ఈ ఆంధ్రాలో అక్కటుకునే అంశాలు. లేటెస్ట్ గా వచ్చిన ఈ టెక్నో బడ్జెట్ బీస్ట్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్, ధర మరియు మరిన్ని వివరాలను గురించి తెలుసుకుందామా.        

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Tecno Pova 3:

ముందుగా టెక్నో పోవా 3 ధర విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 11,499 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చెయ్యబడింది. ఈ ధర 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం నిర్ణయించబడింది. అలాగే, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. జూన్ 27 నుండి ఈ ఫోన్ సేల్ మొదలువుతుంది మరియు అమెజాన్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. 

Tecno Pova 3 (1).jpg

Tecno Pova 3: స్పెక్స్

టెక్నో పోవా 3 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.9 ఇంచ్ FHD+ డాట్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన గేమింగ్ ప్రాసెసర్ Helio G88 శక్తితో పనిచేస్తుంది. అంతేకాదు, దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 5GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను కూడా జత చేసినట్లు కంపెనీ ప్రకటించింది. టెక్నో పోవా 3 అతిపెద్ద 7000 mAh బ్యాటరీని 33W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 14 గంటల గేమింగ్ సమయాన్ని అందిస్తుందని కూడా టెక్నో పేర్కొంది. 

Tecno Pova 3 (2).jpg

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 50MP మైన్ కెమెరాకి జతగా మరొక రెండు కెమరాలు ఉంటాయి మరియు క్వాడ్ LED ఫ్లాష్ కూడా వుంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. గేమింగ్ కోసం 4D వైబ్రేషన్ Z-Axiz లీనియర్ మోటార్ మరియు DTS సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా ఈ ఫోన్ కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile