Curved AMOLED డిస్ప్లే వంటి భారీ ఫీచర్లతో తక్కువ ధరలో వచ్చిన టెక్నో స్మార్ట్ ఫోన్.!
కర్వ్డ్ డిస్ప్లేతో Tecno Phantom X విడుదల
డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో వచ్చిన టేకు కొత్త ఫోన్
ఈ ఫోన్ తో బ్లూటూత్ స్పీకర్‌ను ఉచితంగా అఫర్ చేస్తోంది
Tecno ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Tecno Phantom X ని విడుదల చేసింది. టెక్నో ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం ఫీచర్లతో తీసుకువచ్చింది. ఈ ఫోన్ లో ప్రీమియం కర్వ్డ్ AMOLED డిస్ప్లే, ముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరా మరియు 5GB వరకూ వర్చువల్ RAM వంటి మరిన్ని స్పెక్స్ మరియు ఫీచర్లను టెక్నో అందించింది. మరి ఈ లేటెస్ట్ టెక్నో స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లను గురించి చూద్దామా.
SurveyTecno Phantom X: ప్రైస్
టెక్నో ఫాంటమ్ స్మార్ట్ ఫోన్ ను రూ.25,999 ప్రైస్ ట్యాగ్ తో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ బ్లూటూత్ స్పీకర్‌ను మరియు వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌ను ఉచితంగా అఫర్ చేస్తోంది.
Tecno Phantom X: స్పెక్స్
టెక్నో ఫాంటమ్ X స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ Curved AMOLED డిస్ప్లేని 90 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే కొంచెం పెద్దదైన పంచ్ హోల్ డిజైన్ తో వస్తుంది మరియు ఈ కటౌట్ లో డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G95 చిప్ సెట్ తో పనిచేస్తుంది మరియు జతగా 8GB LPDDR4X RAM మరియు 256GB UFS 2.1 స్టోరేజ్ ని కలిగివుంది. అంతేకాదు, ఈ ఫోన్ 5GB వర్చువల్ ర్యామ్ తో కూడా వస్తుంది మరియు ఈ ఫీచర్ తో ర్యామ్ 13GB వరకూ వర్చువల్ ర్యామ్ గా విస్తరిస్తుంది. దీనికోసం ఇంటర్నల్ స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఇందులో, 50MP మైన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 13MP పోర్ట్రైట్ లెన్స్ కూడా ఉన్నాయి. ముందుభాగంలో, 48MP + 8MP డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 33W అడాప్టర్‌తో కూడిన 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, USB-C 2.0 సాకెట్, WiFi ac, బ్లూటూత్ 5.0 మరియు 3.5mm ఆడియో జాక్‌ని కూడా పొందుతారు.