పదివేల ధరకే మూడు కెమెరాల ఫోన్ : Tecno Camon i4

HIGHLIGHTS

ఈ కేటగిరిలో అనేక ప్రత్యేక లక్షణాలను కలిగిన స్మార్ట్ ఫోనుగా దీన్ని పరిచయంచేసింది.

Tecno Camon i4 లో ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సేటప్పును అందించింది టెక్నో సంస్థ.

ట్రిపుల్ రియర్ కెమేరా 13MP+ 2MP+ 8MP సెన్సర్లను కలిగి ఉంటుంది.

ఒక 6.22 అంగుళాల డాట్ నోచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది.

Tecno భారతదేశంలో తన Camon i4 స్మార్ట్ ఫోన్ యొక్క వేరియంట్లను ప్రారంభించింది మరియు ఈ సంస్థ వేగంగా బడ్జెట్ ఫోన్ల విభగంలో వేగంగా విస్తరిస్తోంది. ఇంతకుముందు, బడ్జెట్ సెగ్మెంట్లో డ్యూయల్ కెమెరా డిజైన్ తో కూడిన ఫ్యూజన్ పేరుతో తీసుకొచ్చిన మొబైల్ తో మంచి పేరును సంపాదించింది. ఇప్పుడు, ఈ స్మార్ట్ ఫోనులో AI ట్రిపుల్ కెమెరా, పెద్ద డిస్ప్లే , తాజా OS మరియు ఈ కేటగిరిలో అనేక ప్రత్యేక లక్షణాలను కలిగిన స్మార్ట్ ఫోనుగా దీన్ని పరిచయంచేసింది.

Tecno Camon i4 ప్రత్యేకతలు

Tecno Camon i4 లో అందించిన 6.22 అంగుళాల డిస్ప్లే 720×1520 పిక్సెల్స్ రిజల్యూషన్ను కలిగి ఉంది మరియు సంస్థ ఒక పెద్ద డిస్ప్లేను అందించడానికి ఈ స్మార్ట్ ఫోన్ ఒక డాట్ నోచ్ తో అందించబడింది. యూజర్లు కూడా ఈ పెద్ద HD + డిస్ప్లేని  వీడియో లేదా గేమింగ్ కోసం ఇష్టపడుతారు. ఈ పరికరం UI చాలా మృదువైన మరియు ముందుగానే ఇన్స్టాల్ చేసిన ఆప్లతో వస్తుంది. ఇది ఒక ఆండ్రాయిడ్ 9 పై ఆధారితంగా Hios 4.0 OS పైన నడుస్తుంది. ఇందులో ఫేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించడింది.  అధనంగా, ఇది 3500mAh బ్యాటరీతో వస్తుంది.  

ఈ Tecno Camon i4 మూడు వీరియంట్లతో అందించబడింది, 2GB ర్యామ్ 32GB స్టోరేజి వేరియంట్, 3GB ర్యామ్ 32GB స్టోరేజి వేరియంట్ మరియు 4GB ర్యామ్ 64GB స్టోరేజి వేరియంట్ తో వస్తుంది. అంతేకాదు, అమేజాన్ ఇండియా నుండి అమ్మకాలకు సిద్ధంగా వుంది. ఈ ఫోను ఆరునెలల వన్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ వారంటీతో వస్తుంది.ఈ ఫోన్ యొక్క సాధారణ వేరియంట్ రూ. 9,499 ధరతో ప్రారంభమవుతుంది.     

ఇక కెమేరాల విభాగానికి వస్తే, ఇందులో ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సేప్పును అందించింది టెక్నో సంస్థ. ఇందులోని ట్రిపుల్ రియర్ కెమేరా 13MP+ 2MP+ 8MP సెన్సర్లను కలిగి ఉంటుంది. Camon i4 లో ఇచ్చిన AI కెమెరా కూడా ఆకర్షణకు కేంద్రంగా ఉంది. ఈ ట్రిపుల్ కెమెరా బొకే షాట్స్ (పోర్ట్రైట్ ) ను తీయగలదు మరియు వెనుక మరియు ముందు కెమెరా AR స్టిక్కర్లను కూడా అందిస్తాయి. పోర్ట్రైట్ షాట్లు ఫ్రంట్ కెమెరా నుండి కూడా తీసుకోవచ్చు, మరియు రెండూ కెమెరా మోడ్తో వస్తాయి. ముందు, ఒక 16MP AI సెల్ఫీ కెమేరాను అందించారు.    

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :