అతిత్వరలో రియల్మీX2 ప్రో ఇక 6GB ర్యామ్+ 64GB స్టోరేజి వేరియంట్ రూ.27,999 ధరతో రానుంది.

అతిత్వరలో రియల్మీX2 ప్రో ఇక 6GB ర్యామ్+ 64GB స్టోరేజి వేరియంట్ రూ.27,999 ధరతో రానుంది.
HIGHLIGHTS

ఈ వేరియంట్ అమ్మకానికి అందుబాటులోకిరానున్నది.

గత నెలలో, రియల్మీ సంస్థ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి రియల్మీ X2 ప్రో ను ఇండియాలో విడుదల చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ను 8GB ర్యామ్ + 128GB స్టోరేజి మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజిలతో రూ.29,999 రుపాయల ప్రారంభదరలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేకతల పరంగా చూసినట్లయితే, ఈ ధరలు సమంజసంగా అనిపించినా, Low-End వేరియంట్ లేకపోవడం కొంత వెలితిగా అనిపించింది. అందుకోసమే కావాచ్చు ఇప్పుడు, రియల్మీ సంస్థ కొత్త 6GB ర్యామ్ + 64GB స్టోరేజి వేరియంట్ ని కేవలం రూ.27,999 ధరలో అందుబాటులోకి తీసుకు వస్తోంది మరియు అతిత్వరలోనే ఈ వేరియంట్ అమ్మకానికి అందుబాటులోకిరానున్నది.

Realme X2 PRO ప్రత్యేకతలు

Realme X2 PRO స్మార్ట్ ఫోన్ను ఒక మిడ్-రేంజ్ హ్యాండ్‌ సెట్ గా, రియల్మీ సంస్థ ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చింది . ఈ ఫోన్ ఒక 6.5-అంగుళాల Full HD + సూపర్ AMOLED డిస్ప్లేని 91.9 శాతం స్క్రీన్ టూ బాడీ నిష్పత్తితో కలిగి ఉంది. ఈ డిస్ప్లేలో వాటర్‌డ్రాప్ నోచ్ డిజైన్ ఉంది, ఇందులో  సెల్ఫీ కెమెరా ఉంచబడుతుంది. ముఖ్యంగా, ఈ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో తీసుకొచ్చింది. అంటే, ఈ ఫోన్ యొక్క డిస్ప్లే మరింత సున్నితమైన వీడియో క్వాలిటీ మరియు పనితనాన్ని అందిస్తుంది మరియు ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో పాటుగా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, వెనుక ఒక ప్రత్యేకమైన 3D గ్లాస్ డిజైన్ కలిగి ఉంది మరియు  ఇది పెరల్ బ్లూ మరియు పెరల్ వైట్ కలర్ ఎంపికలతో వస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, రియల్మి X2 ప్రో వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఇది f / 2.25 ఎపర్చరు లెన్స్తో ఒక 13 MP  టెలిఫోటో లెన్స్ కి జతగా ఒక  ప్రధాన 64MP ప్రాధమిక సెన్సార్‌తో పాటు, F / 2.4 లెన్స్‌తో 8MP అల్ట్రా వైడ్ లెన్స్ మరియు 2MP డెప్త్ కెమెరా కూడా వుంది. ఈ స్మార్ట్ ఫోన్, మెరుగైన Low -Light చిత్రాలను కూడా అందిస్తుంది. ముందు భాగంలో 16MP సోనీ  IMX471 సెన్సార్, f / 2.0 ఎపర్చర్‌తో ఉంటుంది. ఇంకా ఇందులో ఆడియో కోసం ప్రత్యేకంగా Dolby Atmos ని కూడా అందించింది. 

రియల్మీ X2 ప్రో  గరిష్టంగా 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇక దీనితో పాటుగా 12GB ర్యామ్ మరియు 256 స్టోరేజి మాస్టర్ ఎడిషన్ను కూడా లాంచ్ చేసింది. దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్‌లో హైపర్‌బూస్ట్ 2.0 అమర్చారు, ఇది గేమింగ్ ఆడేటప్పుడు మరింత మధురానుభూతిని అందిస్తుంది. అలాగే, ఒక 50W సూపర్ VOOC ఛార్జింగ్ టెక్నాలజీ కలిగిన 4000mAh బ్యాటరీతో మద్దతు ఉన్నఈ హ్యాండ్‌ సెట్ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది. ఈ సూపర్ VOOC ఛార్జింగ్ కేవలం 35 నిమిషాల్లో ఈ హ్యాండ్‌ సెట్ యొక్క బ్యాటరీని 100 శాతం నింపుతుంది.                                 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo