ఎనిమిది కెమెరాతో రానున్న Sony స్మార్ట్ ఫోన్

Updated on 20-Jun-2019

క్వాలిటీ ప్రొడక్స్ట్ అందించే బెస్ట్ బ్రాండ్ గా పేరుగాంచినటువంటి Sony సంస్థ స్మార్ట్ ఫోన్ విభాగంలో మాత్రం కొంత వెనుకబడిందని చెప్పొచ్చు. చైనా యొక్క రైవల్స్ స్మార్ట్ ఫోన్ విభాగంలో దూసుకుపోతున్నాయి. అయితే, ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షితున్న 48MP కెమేరాలలో ప్రధాన మరియు బెస్ట్ సెన్సార్ ని అందించింది మాత్రం Sony సంస్థ మాత్రమే, అదే Sony IMX586 సెన్సార్. ఇది ఒక్కటి మాత్రం కాదు, దాదాపుగా చాల ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో Sony సెన్సర్లను కచ్చితంగా ఉపయోగిస్తారు.

ఇప్పుడు, సోనీ సంస్థ కూడా అనూహ్యంగా అత్యధికమైన సంఖ్యలో కెమేరాలను కలిగిన స్మార్ట్ ఫోన్ ఒక దాన్ని మార్కెట్లోకి తీసుకురానున్నాదని, టిప్స్టర్ Max J తన ట్విట్టర్ పేజీలో దీని గురించిన వివరాలను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి తాను అందించిన రెండర్లు (ఊహ చిత్రాలు) నిజంగా గొప్ప కెమేరా వివరాలను అందిస్తున్నాయి. ఈ రెండర్ల ప్రకారం, ఇందులో ఈ ఫోన్ వెనుక భాగంలో ఆరు కెమేరాలను కలిగి ఉంటుంది. అలాగే ముందుభాగంలో సెల్ఫీ కోసం డ్యూయల్ కెమెరాని కలిగి ఉంటుంది.

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :