REALME 5s ప్రత్యేకతలు వెల్లడించిన Flipkart

REALME 5s ప్రత్యేకతలు వెల్లడించిన Flipkart
HIGHLIGHTS

ఫ్లిప్‌ కార్ట్‌ లో అందించిన మైక్రోసైట్ పేజీలో వెల్లడించింది.

ఇండియాలో, నవంబర్ 20 న తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి,  రియల్మి X 2 ప్రో ని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ తో పాటుగా, బడ్జెట్ ధరలోఒక 48MP ప్రధాన కేమెరా కలిగిన క్వాడ్ కెమేరాతో Realme 5S ను కూడా విడుదలవడానికి సిద్ధంగా ఉన్నట్లు ధృవీకరించబడింది. అంతేకాదు, రియల్మి 5 S యొక్క కొన్ని ముఖ్యమైన ప్రత్యేకతలను కూడా ఫ్లిప్‌ కార్ట్‌ లో అందించిన మైక్రోసైట్ పేజీలో వెల్లడించింది. ఈ హ్యాండ్‌ సెట్ 48MP ప్రైమరీ సెన్సార్‌ తో వెనుక ఒక క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని ఇది సూచిస్తుంది.

రియల్మి 5 ఎస్, ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన రియల్మి 5 యొక్క అప్‌ గ్రేడ్ వెర్షన్ గా అంటుంది. ఇది ఇప్పటికే భారతదేశంలో తప్పనిసరి BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ మరియు థాయ్‌లాండ్‌లోని NBTC (నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కమిషన్) సర్టిఫికేషన్నుపొందింది, ఈ హ్యాండ్‌సెట్ త్వరలో రెండు దేశాల్లో ప్రారంభించవచ్చని, ఈ అప్డేట్ చెబుతోంది.

రియల్మి 5 ఎస్ ఒక 6.51-అంగుళాల HD + (720×1600 పిక్సెల్స్) డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 4GB RAM తో జతగా చేసిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌ సెట్ శక్తితో అందివ్వగలదు. ఈ స్మార్ట్‌ ఫోన్ 48MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. ఏదేమైనా, ఇతర మూడు సెన్సార్ల యొక్క ఖచ్చితమైన లక్షణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇంకా, రియల్మి 5 S ముందుభాగంలో ఒక 13MP సెల్ఫీ షూటర్ కలిగి ఉంటాయి. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడుతుంది.        

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo