ట్రాన్స్పరెంట్ ఫోన్లతో సోనీ అదరగొట్టనుందా?

HIGHLIGHTS

ఈ సంస్థ స్మార్ట్ ఫోనులో ట్రాన్సపరెంట్ డిస్ప్లే (పారదర్శక ప్రదర్శన) కోసం ఒక పద్ధతిని వివరించే పేటెంట్నుదాఖలు చేసింది.

ట్రాన్స్పరెంట్  ఫోన్లతో సోనీ అదరగొట్టనుందా?

ప్రస్తుతం అందరి దృష్టిలో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లనేవి, స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలో తదుపరి పెద్ద విషయంగా అనిపిస్తుంది.  ఇప్పటికే,  శామ్సంగ్ వచ్చే ఏడాది ఇటువంటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్నుప్రారంభించాలన్న తన ప్రణాళికలను సిద్ధంచేస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే, ప్రముఖ జపాన్ కంపెనీ అయిన సోనీ కూడా వీటన్నిటిని మరిపించేలా, సరికొత్త ప్రణాళికలతో ఇటువంటి ఫోన్లను విడుదల చేయటానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది అనిపిస్తోంది. ఈ సంస్థ  స్మార్ట్ ఫోనులో ట్రాన్సపరెంట్ డిస్ప్లే (పారదర్శక ప్రదర్శన) కోసం ఒక పద్ధతిని వివరించే పేటెంట్నుదాఖలు చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మొదటగా LetsGoDigital చే వెలుగులోకివచ్చిన, ఈ పేటెంట్ రెండు డిస్ప్లేలతో కూడిన ఒక స్మార్ట్ ఫోన్ను చూపిస్తుంది. ఒకటి ముందు, మరియు మరొకటి వెనుక ఉంటుంది. అపారదర్శక, పారదర్శక (ట్రాన్స్పరెంట్), ట్రస్లూసెంట్(పారదర్శక మరియు అపారదర్శక మధ్యస్థ స్థితి) వంటి వాటితో, ఒక ఆరు రకాల వివిధరకాల మోడళ్ల పైన పనిచేస్తుంది. ఈ వెబ్ సైట్ స్మార్ట్ ఫోన్ ఎలా కనిపించాలి అనేదానికి కొన్ని రెండెర్స్ కూడా అందించింది.

ఇది నిజంగా ఒక ఫోనులో డ్యూయల్ డిస్ప్లేని వాడడానికి ఇది ఒక ప్రత్యేకమైన మార్గం కావచ్చు. అయితే, ఈ సంస్థ మార్కెట్లో తన ప్రాచుర్యాన్ని తిరిగి తీసుకురావడానికి ఇది కచ్చితంగా ఒక చక్కని మార్గం. ఎందుకంటే, కేవలం ఈ పేటెంటేల్నను పొందిన తరువాత, కేవలం సోని మాత్రమే అటువంటి పరికరాన్ని తయారుచేయగలుగుతుంది, కానీ ఈ భవిష్య పరికరాలలో సోని దీనిని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా  అన్న విషయం గురించి వేచిచూడాలి.               

ఈ విషయాలన్నీ చూస్తుంటే, 2019 స్మార్ట్ ఫోన్ల కోసం చాలా ఆసక్తికరమైన సంవత్సరంగా ఉండబోతున్నట్లు అనిపిస్తుంది. కొన్ని సంస్థలు 5G తో పరికరాల కోసం చూస్తుంటే,  శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ పైన దృష్టిపెట్టింది మరియు సోని ట్రాన్స్పరెంట్ ఫోన్ల కోసం ప్రయత్నిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo