సెగ్మెంట్ బిగ్ బ్యాటరీ 5జి ఫోన్ గా వచ్చిన Realme Narzo 100x 5G ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

రియల్‌మీ నార్జో సిరీస్ నుంచి ఈరోజు న్యూ జనరేషన్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది

Realme Narzo 100x 5G ను సెగ్మెంట్ బిగ్ బ్యాటరీ 5జి ఫోన్ గా లాంచ్ చేసింది

ఈ ఫోన్ తో గొప్ప లాంచ్ ఆఫర్స్ ను కూడా కంపెనీ అందించింది

రియల్‌మీ నార్జో సిరీస్ నుంచి ఈరోజు న్యూ జనరేషన్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అదే, Realme Narzo 100x 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను సెగ్మెంట్ బిగ్ బ్యాటరీ 5జి ఫోన్ గా లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో బ్యాటరీ బ్యాకప్ పోరు కొనసాగుతోంది. ఈ బాటలో ఫస్ట్ 10,000 mAh ఫోన్ అందించిన రియల్ మీ ఇప్పుడు 20 వేల ప్రైస్ సెగ్మెంట్ లో 8,000 mAh బ్యాటరీ ఫోన్ గా ఈ ఫోన్ ను రిలీజ్ చేసింది. ఈ తాజా స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకుందాం.

Realme Narzo 100x 5G : ప్రైస్

రియల్‌మీ నార్జో 100x 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ (4GB + 128GB) వేరియంట్ ను రూ. 20,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మిడ్ (6GB + 128GB) వేరియంట్ ను రూ. 22,999 ప్రైస్ ట్యాగ్ తో మరియు హై ఎండ్ (6GB + 256GB) వేరియంట్ ను రూ. 24,999 ప్రైస్ తో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ఫ్లాష్ ఆరెంజ్ మరియు మిడ్ నైట్ బ్లాక్ రెండు రంగుల్లో లాంచ్ అయ్యింది.

ఆఫర్స్ అండ్ సేల్

ఈ ఫోన్ తో గొప్ప లాంచ్ ఆఫర్స్ ను కూడా కంపెనీ అందించింది. ఈ ఫోన్ యొక్క మూడు వేరియంట్స్ పై రూ. 2,000 డిస్కౌంట్ మరియు రూ. 500 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ.18,499 రూపాయల ధరకే లభిస్తుంది. అయితే, రియల్‌మీ అందించిన ఈ ప్రత్యేకమైన ఆఫర్లు కేవలం జూలై 22వ తేదీన జరిగే ఫస్ట్ సేల్ ఒకరోజు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ జూలై 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది.

Also Read: PMJDY 2026 స్కీమ్ తో 2 లక్షలు సింపుల్ గా పొందండి.. అంటూ Whatsapp మెసేజ్ నిజానిజాలు తెలుసుకోండి.!

Realme Narzo 100x 5G : ఫీచర్స్

రియల్‌మీ నార్జో 100 ఎక్స్ ఫోన్ 6.8 ఇంచ్ బిగ్ LCD డిస్ప్లే ని HD+ రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు Panda-1681 గ్లాస్ రక్షణతో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ MIL-STD 810H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో వస్తుంది. ఇది మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ జతగా 6GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ UI 7.0 జతగా ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యింది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు Ai కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రియర్ కెమెరా సెటప్ పక్కనే నోటిఫికేషన్ లైట్ ఉంది. ఇది 9 కలర్స్ తో పాటు 5 స్పీడ్ ఆప్షన్స్ తో ఏ ఫోన్ ను మరింత సుందరంగా మార్చింది.

ఈ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 8000 mAh పవర్ ఫుల్ అండ్ బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఇది కాకుండా ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W Super Vooc ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ అండ్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో బిగ్ సౌండ్ కోసం పెద్ద సూపర్ లైనర్ సేపేకాల్రు`స్పీకర్లు, బిల్ట్ ఇన్ గూగుల్ Gemini Ai మరియు IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ని కూడా ఈ ఫోన్ ఆఫర్ చేసింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :