Digit.in
  • న్యూస్
  • ఫీచర్స్
  • How to
  • విసువల్ స్టోరీస్
  • English
  • Hindi
  • Tamil
  • Kannada
  • Telugu
  • Malayalam
  • Bangla
  • Marathi
Login / Register is disabled Login
Home » News » General » PMJDY 2026 స్కీమ్ తో 2 లక్షలు సింపుల్ గా పొందండి అంటూ WhatsApp మెసేజ్..నిజానిజాలు తెలుసుకోండి.!

PMJDY 2026 స్కీమ్ తో 2 లక్షలు సింపుల్ గా పొందండి అంటూ WhatsApp మెసేజ్..నిజానిజాలు తెలుసుకోండి.!

By Raja Pullagura | Updated on 16-Jul-2026
Add DIGIT as a preferred source
Follow Us on Google News Follow Us
HIGHLIGHTS

ఒక వైరల్ మెసేజ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, వాట్సాప్‌ లో విస్తృతంగా షేర్ అవుతోంది

PMJDY 2026 స్కీమ్ తో 2 లక్షలు సింపుల్ గా పొందండి మెసేజ్ WhatsApp లో సర్క్యులేట్ అవుతోంది

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ ప్రజల ప్రయోజనార్ధం నివేదిక అందించింది

PMJDY 2026 స్కీమ్ తో 2 లక్షలు సింపుల్ గా పొందండి అంటూ WhatsApp మెసేజ్..నిజానిజాలు తెలుసుకోండి.!
Raja Pullagura Raja Pullagura
16-Jul-2026

ప్రస్తుతం ఒక వైరల్ మెసేజ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, ముఖ్యంగా వాట్సాప్‌ లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ మెసేజ్ పెద్దగా ఉన్నా “PMJDY 2026 స్కీమ్ తో 2 లక్షలు సింపుల్ గా పొందండి” అనే సారాంశం తో ఉంటుంది. ఈ మెసేజ్ WhatsApp లో చాలా వేగంగా షేర్ అవుతున్నట్లు గుర్తించారు. వాట్సాప్ యూజర్లు మరియు ప్రజలు ఈ మెసేజ్ గురించి నిజానిజాలు తెలుసుకునేలా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ ప్రజల ప్రయోజనార్ధం నివేదిక అందించింది. ఈ వాట్సాప్ వైరల్ మెసేజ్ గురించి చెబుతున్న నిజాలు ఏమిటో తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

PMJDY 2026 Viral WhatsApp మెసేజ్ ఏమిటి?

వాట్సప్ లో ఒక మెసేజ్ ఇప్పుడు శరవేగంగా షేర్ అవుతూ బాగా వైరల్ అయ్యింది. ఈ మెసేజ్ లో “ప్రధాన మంత్రి జనధన్ యోజన (PMJDY) 2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి మరియు 13 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయులు వయస్సు ఆధారంగా రూ.50,000 నుంచి రూ.2,00,000 వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు” అని వ్రాసి ఉంది.

PMJDY 2026 WhatsApp Viral Message PIB Fact Check

మన దేశంలో అసలే పథకాలు ఎక్కువ మరియు ఉచిత పథకాలకు అలవాటు పడిన చాలా మంది ఈ మెసేజ్ ను నిజమే అని నమ్మే అవకాశం ఉంది. అందుకే, దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ స్పందిస్తూ ఈ ప్రచారం పూర్తిగా అవాస్తమని స్పష్టం చేసింది.

PIB Fact Check రిపోర్ట్ ఏమి చెబుతోంది?

PIB వెల్లడించిన వివరాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం జనధన్ యోజన కింద వయస్సు ఆధారంగా రూ.50,000 నుంచి రూ. 2,00,000 వరకు నగదు సాయం అందించే ఎలాంటి కొత్త పథకాన్ని ప్రకటించలేదని తేల్చి చెప్పింది. ఈ వైరల్ సందేశంలో పేర్కొన్న ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కూడా అధికారికం కాదని తెలిపింది. ఇలాంటి సందేశాలను నమ్మి అందులో ఉన్న అనుమానాస్పద వెబ్‌సైట్‌ లు లేదా లింక్‌ లలో వ్యక్తిగత వివరాలు లేదా బ్యాంకు సమాచారం లేదా ఆధార్ వివరాలు నమోదు చేయొద్దని ప్రజలని హెచ్చరించింది.

Also Read: Realme C100x: బిగ్ బ్యాటరీ 4G ఫోన్ కోరుకునే వారి కోసం కొత్త ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ.!

ప్రధాన మంత్రి జనధన్ యోజన పథకం ఏమిటి?

ప్రధాన మంత్రి జనధన్ యోజన పథకం అనేది దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఆర్థిక చేరిక (Financial Inclusion) కార్యక్రమం. ఈ పథకం ద్వారా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా, రూపే డెబిట్ కార్డు, అర్హత ఆధారంగా ప్రమాద బీమా కవరేజ్ మరియు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) సౌకర్యం వంటి సేవలు అందిస్తుంది. అలాగే కొన్ని నిబంధనల మేరకు ఓవర్‌ డ్రాఫ్ట్ వంటి బ్యాంకింగ్ ప్రయోజనాలు కూడా యూజర్లకు అందుబాటులో ఉంటాయి.

అయితే, వాట్సాప్ లో షేర్ అవుతున్న వైరల్ మెసేజ్ లో చెప్పినట్లు పథకం ద్వారా అర్హులకు నేరుగా 50 వేల నుంచి 2 లక్షల వరకు నగదు సాయం అందించే రూల్ అసలు లేనే లేదు. ఇది పూర్తిగా అవాస్తవం మరియు ప్రజలను మోసం చేయడానికి స్కామర్లు విసిరిన వల మాత్రమే అని ప్రజలు గుర్తించాలి.

ప్రభుత్వ పథకాల గురించి సమాచారం తెలుసుకోవాలంటే అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లు లేదా PIB Fact Check వంటి విశ్వసనీయ సోర్స్ లు మాత్రమే ఆధారంగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Latest Article
BSNL Independence Day offer: కస్టమర్‌లకు గుడ్ న్యూస్ అందించిన బిఎస్ఎన్ఎల్.! BSNL Independence Day offer: కస్టమర్‌లకు గుడ్ న్యూస్ అందించిన బిఎస్ఎన్ఎల్.!
ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ డిస్కౌంట్ దెబ్బకి నార్మల్ సౌండ్ బార్ రేటుకే 5.2.4 Dolby Atmos సౌండ్ బార్స్ లభిస్తున్నాయి.! ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ డిస్కౌంట్ దెబ్బకి నార్మల్ సౌండ్ బార్ రేటుకే 5.2.4 Dolby Atmos సౌండ్ బార్స్ లభిస్తున్నాయి.!
Moto G Max: ఆకర్షణీయమైన ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది.! Moto G Max: ఆకర్షణీయమైన ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది.!
Independence Day 2026 : బెస్ట్  స్వాతంత్ర్య దినోత్సవ విషెస్ మరియు ఇమేజస్ తెలుగులో అందించాము.! Independence Day 2026 : బెస్ట్ స్వాతంత్ర్య దినోత్సవ విషెస్ మరియు ఇమేజస్ తెలుగులో అందించాము.!
PHILIPS 55 QLED Smart Tv పై అమెజాన్ భారీ డిస్కౌంట్ .. టీవీని బడ్జెట్ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.! PHILIPS 55 QLED Smart Tv పై అమెజాన్ భారీ డిస్కౌంట్ .. టీవీని బడ్జెట్ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.!
Most Searched Mobile Phones
  • Best Phones Under 10000
  • Best Phones Under 20000
  • Best Phones Under 30000
  • Upcoming Phones in 2026
  • Latest Mobile Phones
Latest Phones
  • Samsung Galaxy Z Fold 8
  • Samsung Galaxy Z Flip 8
  • Samsung Galaxy Z Fold 8 Ultra
  • Redmi Turbo 5
  • Motorola Razr Fold
Mobile Recharge Plans
  • Airtel Recharge Plans
  • BSNL Recharge Plans
  • Reliance JIO Recharge Plans
  • VI Recharge Plans
Telugu Tech News
  • EPFO ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.!
  • Mahavatar Narsimha OTT లోకి ఎప్పుడు వస్తుందంటే.!
  • Jio, Airtel ని మించిన ఫ్రీ ఆఫర్ తెచ్చిన BSNL టెలికాం.!
  • Vivo V60 టాప్ 5 ఫీచర్స్ అంచనా ప్రైస్ తెలుసుకోండి.!
  • icon
  • icon
  • icon
  • icon
SUBSCRIBE Subscribe for the industry's biggest tech news
Enter your email to get notified about our new solutions
By submitting your email, you agree to our
Terms and Privacy Notice.
CONNECT WITH US
  • icon Times Center, FC-6, 1st Floor, Sector 16A, Film City, Noida - 201301
  • icon (+91-120-6776999)
    (1800 121 0005)
  • icon Suggestion: editor@digit.in
    Business: business@digit.in
    Website: sales@digit.in
© 2026 Digit.in, All rights reserved
  • icon
  • icon
  • icon
  • icon
icon
  • About Us
  • Contact Us
  • Advertise with us
  • Regulatory
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
© 2026 Digit.in, All rights reserved
Digit.in
Logo
Digit.in
Logo