108MP+48MP+12MP భారీ ట్రిపుల్ కెమేరాతో వచ్చిన శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా

108MP+48MP+12MP భారీ ట్రిపుల్ కెమేరాతో వచ్చిన శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా
HIGHLIGHTS

ఇందులో 8K వీడియో రికార్డింగ్ 100X జూమ్ వంటి ఎన్నో విశేషాలతో

నిన్న జరిగినగిన Unpacked 2020 కార్యక్రమం వేదికగా, శామ్సంగ్ తన తాజా ఫ్లాగ్‌ షిప్ లైనప్‌లో గెలాక్సీ S 20, గెలాక్సీ 20+ మరియు గెలాక్సీ S 20 అల్ట్రా అనే మూడు మోడళ్లను ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్‌లు 4 జి మరియు 5 జి వేరియంట్‌లలో వస్తాయి. అయితే , ఈ మూడు ఫోన్లలో కూడా గెలాక్సీ 20 అల్ట్రా మాత్రం తన కెమేరా ఫీచర్లతో అబ్బురపరిచింది. ఇందులో 8K  వీడియో రికార్డింగ్ 100X జూమ్ వంటి ఎన్నో విశేషాలతో పాటుగా 16GB తో కూడా రానుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా

ఇక శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా విషయానికి వస్తే, ఇది సంస్థ నుండి వచ్చిన అత్యధిక ప్రీమియం స్మార్ట్ ఫోన్. ఇది 6.9-అంగుళాల QHD డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది ప్రాంతాన్ని బట్టి ఈ హ్యాండ్‌ సెట్‌ లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC లేదా Exynos 990 చిప్‌ సెట్ యొక్క శక్తితో వస్తాయి.

 అయితే, అత్యంత వేగవంతమైన 12GB లేదా 16GB RAM తో వస్తుంది. స్టోరేజి ఎంపికలలో LTE మరియు 5 జి వేరియంట్‌లకు 128 జిబి, 256 జిబి మరియు 512 జిబి నుండి ఉంటాయి. అప్షనల్ అడాప్టర్ ద్వారా 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని హ్యాండ్‌సెట్ ప్యాక్ చేస్తుంది.

ఇందులోని ఆప్టిక్స్ కూడా మారుతుంది. వైడ్-యాంగిల్ మరియు డెప్త్ కెమెరాలతో పాటు, ప్రాధమిక కెమెరా 108MP సెన్సార్, ఇది f / 1.8 ఎపర్చర్‌తో OIS మరియు PDAF కి మద్దతు ఇస్తుంది. ఇది f / 3.5 ఎపర్చరు, PDAF మరియు OIS తో 48MP టెలిఫోటో లెన్స్ ను కూడా కలిగి ఉంటుంది. గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా లో కొత్త పెరిస్కోప్ తరహా టెలిఫోటో లెన్స్ కూడా ఉంది, ఇది 10x హైబ్రిడ్ ఆప్టికల్ జూమ్ మరియు 100x వరకు గరిష్టంగా ‘సూపర్-రిజల్యూషన్ జూమ్’ సాధించడానికి అనుమతిస్తుంది. ముందు భాగంలో 40MP  సెల్ఫీ షూటర్ ఉంది. ఈ శామ్‌సంగ్ గెలాక్సీ S 20 అల్ట్రా స్మార్ట్ ఫోన్ యొక్క ధరను $ 1,399 (సుమారు రూ .99,800) గా ప్రకటిచింది మరియు ఇండియాలో ఈ ఫోన్ యొక్క లాంచ్ గురించి మాత్రం ఎటువంటి సమాచారాన్ని ఇప్పటి వరకూ ప్రకటించలేదు.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo