సైలెంట్ గా కొత్త 5G స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన శామ్సంగ్.. ఇవే ఫీచర్లు.!

HIGHLIGHTS

శామ్సంగ్ ఈరోజు చాలా సైలెంట్ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Glaxy A23 ను ఇండియాలో విడుదల చేసింది

గెలాక్సీ ఎ23 5G స్మార్ట్ ఫోన్ ను కంపెనీ యొక్క అధికారిక వైబ్సైట్ లో లిస్ట్ చేసింది

పెద్ద 5000 mAh బ్యాటరీ మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది

సైలెంట్ గా కొత్త 5G స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన శామ్సంగ్.. ఇవే ఫీచర్లు.!

శామ్సంగ్ ఈరోజు చాలా సైలెంట్ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Glaxy A23 ను ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్ గురించి ఎటువంటి ముందస్తు సమాచారాన్ని కూడా కంపెనీ అందించలేదు. అంతేకాదు, గెలాక్సీ ఎ23 5G స్మార్ట్ ఫోన్ ను కంపెనీ యొక్క అధికారిక వైబ్సైట్ లో లిస్ట్ చేసింది. లేటెస్ట్ గా లాంచ్ చేసిన ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ యొక్క ఫీచర్లను మరియు స్పెక్స్ ను అందించిన శామ్సంగ్, ఈ ఫోన్ ధరను మాత్రం ఇంకా వివరించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ 50ఎంపి క్వాడ్ రియర్ కెమెరా సెటప్, పెద్ద 5000 mAh బ్యాటరీ మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది. శామ్సంగ్ యొక్క ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy A23 5G : ప్రత్యేకతలు

శామ్సంగ్ గెలాక్సీ ఎ23 స్మార్ట్ ఫోన్ ఒక 6.4 అంగుళాల FHD+ రిజల్యూషన్ కలిగిన ఇన్ఫినిటీ – V డిస్ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ ను ఇంకా వెల్లడించలేదు కానీ, ఇది 5G ఆక్టా కోర్ ప్రొసెసరు యొక్క శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్ 4GB, 6GB మరియు 8GB మూడు ర్యామ్ ఎంపికలలో లభిస్తుంది. Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ లో 5,000 mAh పెద్ద బ్యాటరీ మరియు బ్లూటూత్ v5.1 కనెక్టివిటీతో డ్యూయల్-బ్యాండ్ వైఫై ఉన్నాయి.

ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP మైన్ కెమెరా, 5MPఅల్ట్రా వైడ్ సెన్సార్, 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని కూడా అందించింది.

ప్రస్తుతానికి, Samsung Galaxy A23 5G యొక్క ధర మరియు సేల్ గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo