iQOO Z11: డామినేటింగ్ డిజైన్ మరియు లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం భారీగా టీజింగ్ చేస్తోంది

ఈ ఫోన్ డామినేటింగ్ డిజైన్ మరియు లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది

ఇది డెడికేటెడ్ AI మరియు 2.7X వేగవంతమైన AI ఫీచర్ తో వస్తుంది

iQOO Z11: డామినేటింగ్ డిజైన్ మరియు లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది.!

iQOO Z11: ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం భారీగా టీజింగ్ చేస్తోంది. రీసెంట్ గా జెడ్ 11 సిరీస్ నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన ఐకూ, ఇప్పుడు మిడ్ రేంజ్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ చేస్తోంది. అదే ఐకూ జెడ్ 11 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ డామినేటింగ్ డిజైన్ మరియు లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది. ఈ మాట నేను చెప్పడం లేదు ఐకూ కొత్తగా విడుదల చేసిన టీజర్ నుంచి ఈ విధంగా చెబుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Z11: ఎప్పుడు లాంచ్ అవుతుంది?

ఐకూ జెడ్ 11 స్మార్ట్ ఫోన్ ఆగస్టు 20వ తేదీ భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది మరియు ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ఇండియా ద్వారా ప్రతేకమైన టీజర్ పేజి అందించింది. ఈ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక వివరాలు ఈ రోజు రిలీజ్ చేసింది. ఈ టీజర్ వివరాల్లో కొన్ని మేము ఇప్పటికే అంచనా ఫీచర్స్ ద్వారా అందించాము. ఇదే ఫీచర్స్ ఇప్పుడు కంపెనీ అఫీషియల్ గా రివీల్ చేసింది.

Also Read : Amazon GF Sale నుంచి సాధారణ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ లభిస్తోంది.!

iQOO Z11: టీజర్ ఫీచర్స్

ఐకూ జెడ్ 11 స్మార్ట్ ఫోన్ డిజైన్ గురించి కంపెనీ టీజర్ విడుదల చేసింది. ఇందులో ఈ స్మార్ట్ ఫోన్ డా డామినేటింగ్ డిజైన్ కలిగి ఉన్నట్లు తెలిపింది. విషయంలో మార్కెట్ వర్గాలు కూడా ఏకీభవిస్తున్నాయి. ఎందుకంటే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ చూడగానే ఆకట్టుకునే స్టన్నింగ్ డిజైన్ లో కనిపిస్తోంది. అంతేకాదు, సరికొత్త కలర్ ఆప్షన్ లో కూడా కనిపిస్తోంది. ఇది కర్వుడ్ స్క్రీన్ అండ్ డిజైన్ తో చాలా స్లీక్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తోంది.

iQOO Z11 features

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కలిగిన చిప్ సెట్ వివరాలు కూడా వెల్లడించింది. ఐకూ జెడ్ 11 స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7500 Turbo చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ వెల్లడించింది. ఈ చిప్ సెట్ తో ఇండియాలో లాంచ్ అవుతున్న మొదటి ఫోన్ కూడా ఐదే అని కంపెనీ తెలిపింది. ఇక ఈ చిప్ సెట్ డీటెయిల్స్ లోకి వెళితే, ఇది 4nm ఎఫిషియంట్ నోడ్ చిప్ సెట్ మరియు ఇది 1.2 మిలియన్, అంటే 12 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే సత్తా కలిగి ఉంటుంది. ఇది డెడికేటెడ్ AI మరియు 2.7X వేగవంతమైన AI ఫీచర్ తో వస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంది. ఈ సెటప్ లో ఉన్న కెమెరా వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. అయితే, ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ మరిన్ని కీలక ఫీచర్స్ మరియు అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాము.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile