64MP+8MP+5MP+5MP క్వాడ్ కెమెరాతో వచ్చిన సాంసంగ్ గెలాక్సీ ఏ 32: ప్రైస్ ఎంతో తెలుసా?

64MP+8MP+5MP+5MP క్వాడ్ కెమెరాతో వచ్చిన సాంసంగ్ గెలాక్సీ ఏ 32: ప్రైస్ ఎంతో తెలుసా?
HIGHLIGHTS

సాంసంగ్ గెలాక్సీ ఏ 32 ను తన అధికారిక వెబ్ సైట్ లో లిస్టింగ్ చేసిన సాంసంగ్

సాంసంగ్ గెలాక్సీ ఏ 32 స్మార్ట్ ఫోన్ ను తన అధికారిక వెబ్ సైట్ లో లిస్టింగ్ చేసిన సాంసంగ్. ఈ గెలాక్సీ ఏ 32 స్టైలిష్ డిజైన్, పవర్ ఫుల్ బ్యాటరీ, 800 నిట్స్ గరిష్ఠమైన బ్రైట్నెస్ అందించ గల 90Hz Super AMOLED డిస్ప్లే వంటి మరికొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వుంటుంది. ఈ ఫోన్ యొక్క ప్రైస్ ను కూడా సాంసంగ్ లిస్టింగ్ చేసింది.

సాంసంగ్ గెలాక్సీ ఏ 32: ధర

సాంసంగ్ తన అధికారిక వెబ్సైట్ లో చేసిన లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ 6జీబీ మరియు 128జీబీ స్టోరేజ్ గల వేరియంట్ ను రూ.21,999 రూపాయల ప్రైస్ తో లిస్టింగ్ చేసింది. ఈ ఫోన్, వైట్, బ్లాక్, బ్లూ మరియు వయోలెట్ నాలుగు రంగులలో లభిస్తుంది. అయితే, ఈ గెలాక్సీ ఏ 32 స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అనే విషయాన్ని మాత్రం ప్రకటించ లేదు.                     

సాంసంగ్ గెలాక్సీ ఏ 32: స్పెషిఫికేషన్స్

సాంసంగ్ గెలాక్సీ ఏ 32 ఒక 6.4 అంగుళాల FHD+ డిస్ప్లే ని తో ఉంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 800 నైట్స్ గరిష్ట బ్రెట్ నెస్ సామర్ధ్యం గల Super AMOLED డిస్ప్లే. ఈ  ఫోన్ వెనుక భాగంలో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వుంటుంది. గెలాక్సీ ఏ 32 మీడియా టెక్ హీలియో G80 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు మాలీ-G52 GPU తో పనిచేస్తుంది. దీనికి జతగా 6జీబీ/8జీబీ ర్యామ్ మరియు 128జీబీ వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది మరియు One UI 3.0 స్కిన్ తో వుంటుంది.

కెమెరాల విహాస్యానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 64ఎంపీ మైన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 5ఎంపీ డెప్త్ సెన్సార్ మరియు 5ఎంపీ మ్యాక్రో సెన్సార్ లను కలిగి ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం 20ఎంపీ సెల్ఫీ కెమెరాని ఫోన్ ముందు భాగంలో ఉంచింది. సెక్యూరిటీ కోసం ఇందులో ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా అందించింది. ఇందులో, 5000 mAh బ్యాటరీని 15W అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo