Samsung Galaxy S26 సిరీస్ యూజర్లకు One UI 9 Beta ను సరికొత్త AI ఫీచర్లతో అందించింది.!
One UI 9 Beta ను శాంసంగ్ ఈరోజు అధికారికంగా రిలీజ్ చేసింది
లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం Android 17 ఆధారంగా ఈ అప్‌డేట్ ను రూపొందించింది
ఈ కొత్త అప్ డేట్ ప్రస్తుతం Samsung Galaxy S26 సిరీస్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది
స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో భారీ అప్ డేట్ గా భావిస్తున్న One UI 9 Beta ను శాంసంగ్ ఈరోజు అధికారికంగా రిలీజ్ చేసింది. గూగుల్ ఆండ్రాయిడ్ యొక్క లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం Android 17 ఆధారంగా ఈ అప్‌డేట్ ను రూపొందించింది. ఈ కొత్త అప్ డేట్ ప్రస్తుతం Samsung Galaxy S26 సిరీస్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. భారత్ తో పాటు అమెరికా, యూకే, జర్మనీ, కొరియా వంటి దేశాల్లోని యూజర్ల కోసం ఈ బీటా ప్రోగ్రామ్ ను ప్రారంభించింది.
SurveySamsung Galaxy S26 Series : One UI 9 Beta
ఇప్పటి వరకు అందించిన ఆండ్రాయిడ్ అప్ డేట్ ఒకెత్తయితే ఈ సారి అందించిన అప్ డేట్ మరో విధంగా ఉంటుందని శాంసంగ్ పేర్కొంది. ఎందుకంటే, ఈ కొత్త అప్‌డేట్ ను ప్రధానంగా AI, కస్టమైజేషన్, సెక్యూరిటీ మరియు యాక్సెసిబిలిటీ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించి అందించినట్లు తెలిపింది. ఈ కొత్త అప్ డేట్ లో ఫోన్ వినియోగాన్ని మరింత స్మార్ట్ గా మార్చే అనేక ఫీచర్లు జత కలిసినట్లు కూడా కంపెనీ తెలిపింది.
కొత్త AI ఫీచర్లు
ఈ ఫోన్ లో అందించిన ఏఐ ఫీచర్స్ గురించి కంపెనీ గొప్పగా చెబుతోంది. ఇప్పుడు కాంటాక్ట్స్ యాప్ నుంచి AI ఆధారిత ప్రొఫైల్ కార్డులు, స్టిక్కర్లు మరియు డిజైన్లు నేరుగా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం యూజర్లు వేరే యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు.
Quick Panel పూర్తిగా కొత్త డిజైన్
కొత్తగా అందించిన అప్ డేట్ లో క్విక్ ప్యానల్ ను పూర్తిగా రీడిజైన్ చేసినట్లు శాంసంగ్ తెలిపింది. బ్రైట్నెస్, వాల్యూమ్ మరియు మీడియా కంట్రోల్ వంటి వాటిని వేర్వేరుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అంతేకాదు, సైజ్ మరియు లే అవుట్ మార్చుకునే ఆప్షన్లు కూడా కొత్త ఇందులో చేర్చింది.
శాంసంగ్ నోట్స్ లో కొత్త క్రియేటివ్ టూల్స్
శాంసంగ్ నోట్స్ యాప్ లో ఇప్పుడు కొత్త క్రియేటివ్ టూల్స్ జత చేసింది. ఇందులో డెకరేటివ్ టేప్స్, కొత్త పెన్ స్టైల్స్, మరింత మెరుగైన హ్యాండ్ రైటింగ్ టూల్స్ మరియు AI నోట్ ఫార్మాటింగ్ వంటి ఫీచర్స్ కొత్తగా జోడించింది. విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్లకు ఇది బాగా ఉపయోగపడనుందని శాంసంగ్ తెలిపింది.
Also Read: Sony Bravia Smart Tv ఈరోజు అమెజాన్ సేల్ నుంచి బిగ్ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!
మరింత బలమైన సెక్యూరిటీ
One UI 9 లో కొత్త సెక్యూరిటీ ప్రొటెక్షన్ సిస్టం అందించారు. ఇది ప్రమాదకర యాప్‌లను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది మరియు ఇన్స్టాలేషన్ ను కూడా బ్లాక్ చేస్తుంది. యూజర్ ను యాప్ డిలీట్ చేయమని హెచ్చరిస్తుంది. అంతేకాదు, కొత్త సెక్యూరిటీ అప్‌డేట్స్ పాలసీ కూడా అందిస్తుంది. దీంతో మాల్వేర్ దాడుల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది. కొత్త అప్‌డేట్ లో యూజర్ సేఫ్టి మరియు సెక్యూరిటీ మీద మరింత దృష్టి సారించింది.

ఎవరికి అందుబాటులో ఉంటుంది?
ప్రస్తుతం ఈ కొత్త బీటా అప్‌డేట్ ను శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 సిరీస్ కు అందుబాటులో ఉంది. అంటే, గెలాక్సీ ఎస్ 26, గెలాక్సీ ఎస్ 26 ప్లస్ మరియు గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా ఫోన్ లకు అందుబాటులోకి వచ్చింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile