శామ్సంగ్ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్లు మరియు స్పెక్స్ ఇవే..!!

శామ్సంగ్ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్లు మరియు స్పెక్స్ ఇవే..!!
HIGHLIGHTS

శామ్సంగ్ లేటెస్ట్ గా విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy F13

ఈ ఫోన్ Exynos 850 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది

ఈ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్ల పరంగా జాగ్రత్త్తలు తీసుకుంది

శామ్సంగ్ లేటెస్ట్ గా విడుదల చేసిన  బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy F13. బడ్జెట్ ధరలో వచ్చింది కాబట్టి ఫీచర్లు ఉంటాయో? అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే, శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో ప్రకటించినా కూడా స్పెక్స్ మరియు ఫీచర్ల పరంగా జాగ్రత్త్తలు తీసుకుంది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను 50 MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6000 mAh భారీ బ్యాటరీతో వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో తీసుకువచ్చింది. త్వరలో మొదటిసారిగా అమ్మకాలను కొనసాగించనున్న ఈ శామ్సంగ్ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్లు మరియు స్పెక్స్ లను ఈరోజు చూద్దాం.     

Samsung Galaxy F13: ధర మరియు ఆఫర్లు

Samsung Galaxy F13 (2).jpg

శామ్సంగ్ గెలాక్సీ F13 యొక్క 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 మరియు మరొక వేరియంట్  4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ జూన్ 29 న ప్రారంభమవుతుంది. ఇంట్రడక్టరి అఫర్ లో భాగంగా, ICICI బ్యాంక్ క్రెడిట్/డెబిట్  కార్డ్స్ మరియు EMI లావాదేవీలపై రూ.1,000 తగ్గింపును పొందవచ్చు.          

Samsung Galaxy F13: స్పెక్స్

శామ్సంగ్ గెలాక్సీ F13 స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిటీ-v నోచ్ కలిగిన 6.6- ఇంచ్ LCD డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ శామ్సంగ్ యొక్క సొంత ప్రాసెసర్ Exynos 850 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ఉంటుంది. ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6,000 mAh భారీ బ్యాటరీని కలిగివుంటుంది. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను కూడా కలిగివున్నట్లు శామ్సంగ్ తెలిపింది.

ఈ ఫోన్ లో అందించిన కెమెరాల విషయానికి వస్తే, ఇందులో 8MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-v కటౌట్ లో కలిగివుంటుంది. అలాగే, 50MP ప్రధాన సెన్సార్, 5MP అల్ట్రావైడ్ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్ లను కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరాను కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5mm జాక్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo