9,750 రూ లకు ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ J2 2016 లాంచ్

9,750 రూ లకు ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ J2 2016 లాంచ్

సామ్సంగ్ ఈ రోజు ఇండియాలో గేలక్సీ J2 2016 మోడల్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. దీనితో పాటు గెలాక్సీ J మాక్స్ tablet కూడా రిలీజ్ అయ్యింది. ఫోన్ అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ లింక్ లో లిస్టు అయ్యింది.

J2 price 9,750రూ. ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో జులై 14 నుండి అందుబాటులో ఉండనున్నాయి. 6 నెలలు ఫ్రీ డబుల్ ఇంటర్నెట్ డేటా కూడా ఇస్తుంది airtel సిమ్ పై.

ఇక స్పెక్స్ విషయానికి వస్తే J2 లో ప్రధాన highlight ఫీచర్ next జనరేషన్ LED నోటిఫికేషన్ సిస్టం – దీనినే కంపెని Smart Glow అని పిలుస్తుంది. ఫోన్ వెనుక భాగంలో కెమెరా లెన్స్ చుట్టూ రింగ్ లా ఉంటుంది ఈ LED లైట్.

దీని గురించి మనం రీసెంట్ గా చెప్పుకున్నాము కూడా. ఇది కలర్స్ కూడా మార్చుకునే అవకాశం ఇస్తుంది. అలాగే పర్టికులర్ కాంటాక్ట్/యాప్ కు particular కలర్ ను సెట్ చేసుకోగలరు. ఈ స్మార్ట్ లైట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో చూడగలరు.

స్పెక్స్ – 5 in HD సూపర్ అమోలేడ్ డిస్ప్లే, క్వాడ్ కోర్ 1.5GHz ప్రొసెసర్, 1.5GB రామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్, 8MP రేర్ LED కెమెరా.

5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 4G LTE ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS, 2600mah బ్యాటరీ,  142.4×71.1x8mm measurements తో వస్తుంది ఫోన్.

లాంచ్ ఈవెంట్ లో కంపెని Turbo speed Technology (TST) కూడా కొత్తగా ప్రవేసపెట్టింది. ఇది గేలక్సీ J2 2016 లో ఉంది. యాప్స్ ను 40 శాతం ఫాస్ట్ గా లోడ్ చేస్తుంది. అంతేకాక బ్యాక్ గ్రౌండ్ లో వాడకుండా ఉన్న process లను కూడా shutdown చేస్తుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo