Samsung Galaxy Z Flip 8 launched with powerful features
Samsung Galaxy Z Flip 8 : శాంసంగ్ ఈరోజు కొత్త ఫ్లిప్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ తో పాటు ప్రపంచ మార్కెట్లో కూడా విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో మార్కెట్లో అడుగు పెట్టింది. శాంసంగ్ సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ మరియు ఇండియాలో దీని ధర వివరాలు క్లియర్ గా తెలుసుకోండి.
శాంసంగ్ ఈ కొత్త ఫ్లిప్ ఫోన్ ను స్టైలిష్ ఫోల్డబుల్ డిజైన్ తో పాటు పవర్ ఫుల్ ఫీచర్స్ తో అందించింది. ఇందులో 6.9 అంగుళాల డైనమిక్ AMOLED 2X మెయిన్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది FHD+ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు విజన్ బూస్టర్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ బయట భాగంలో 4.1 అంగుళాల Super AMOLED డిస్‌ప్లే అందించింది. ఈ స్క్రీన్ తో ఫోన్ ను తెరవకుండానే నోటిఫికేషన్లు చూడటం, మెసేజ్‌లకు సమాధానం ఇవ్వడం, విడ్జెట్లు ఉపయోగించడం మరియు సెల్ఫీలు తీయడం వంటివి సులభంగా చేసే వీలుంటుంది.
ఈ ఫోన్ ను శాంసంగ్ యొక్క సొంత మరియు ప్రత్యేకమైన Exynos 2600 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 12GB ర్యామ్ జతగా 256GB / 512GB స్టోరేజ్ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఫోల్డ్ 8 సిరీస్ మాదిరిగానే ఈ ఫోన్ ను కూడా One UI 9 సాఫ్ట్ వేర్ జతగా Android 17 OS తో విడుదల చేసింది. ఈ ఫోన్ కూడా IP48 రేటింగ్ మరియు Wi-Fi 7 తో వచ్చింది. అయితే, ఇందులో బ్లూటూత్ 5.4 వెర్షన్ మాత్రమే ఉంటుంది.
ఆప్టిక్స్ విభాగంలో, ఈ ఫోన్ 50MP వైడ్ యాంగిల్ కెమెరా జతగా 12MP కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 10MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 2X ఆప్టికల్ జూమ్, 4ఖ్ వీడియో రికార్డింగ్, Ai కెమెరా ఫీచర్స్ మరియు లేటెస్ట్ శాంసంగ్ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4,300mAh డ్యూయల్ బ్యాటరీ, 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్, 15W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జ్ మరియు వైర్లెస్ పవర్ షేర్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Samsung Galaxy Z Fold 8 : శాంసంగ్ న్యూ ప్రీమియం ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
శాంసంగ్ ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది, వీటి లాంచ్ ప్రైస్ ఈ క్రింద చూడవచ్చు.
ఈ ఫోన్ ను గ్రాఫైట్, క్రీమ్ మరియు పింక్ మూడు రంగుల్లో అందించింది. అలాగే, కంపెనీ సైట్ నుండి ప్రత్యేకమైన మింట్ వేరియంట్ ను కూడా అందించింది. ఈ ఫోన్ కూడా ఈ రోజు నుంచి ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులోకి వచ్చింది.
ఈ ఫోన్ పియా గొప్ప ప్రీ ఆర్డర్ ఆఫర్స్ ని కంపెనీ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 5,000 అప్గ్రేడ్ ఆఫర్, బ్యాంక్ క్రెడిట్ కార్డ్ / UPI పేమెంట్ తో రూ. 4,000 డిస్కౌంట్ అందించింది.