Home » News » Mobile Phones » అప్ కమింగ్ సామ్సంగ్ గేలక్సీ S8 ఫోన్ యొక్క ఇమేజ్ అంటూ ఫోటో లీక్ అయ్యింది
అప్ కమింగ్ సామ్సంగ్ గేలక్సీ S8 ఫోన్ యొక్క ఇమేజ్ అంటూ ఫోటో లీక్ అయ్యింది
By
Karthekayan Iyer |
Updated on 06-Jan-2017
సామ్సంగ్ గేలక్సీ S8 స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 18 న రిలీజ్ కానుంది అని లేటెస్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. గేలక్సీ నోట్ 7 మోడల్ ఫెయిల్ అయిన తరువాత కంపెని రిలీజ్ చేయబోయే 2017 ఫ్లాగ్ షిప్ మోడల్ పైనే ఉంది మార్కెట్ ద్రుష్టి.
Survey✅ Thank you for completing the survey!
కొరియన్ వెబ్ సైట్ ప్రకారం కొన్ని డిజైన్ మార్పుల కారణంగా ఈ ఇయర్ రిలీజ్ డేట్ కొంచెం వాయిదా అవనుంది. S8 ఫోన్ కొత్త డిజైన్ తో వస్తుంది అని రిపోర్ట్స్.
కంప్లీట్ గా బెజేల్స్ లేకుండా క్రింద బటన్స్ కూడా లేకుండా ఉంటుంది అనేది లేటెస్ట్ గా నెట్ లో హాల్ చల్ చేస్తున్న ఇమేజ్ ద్వారా తెలుస్తుంది. ఫిజికల్ నేవిగేషన్ బటన్స్ కు బదులు సాఫ్ట్ వేర్ టచ్ బటన్స్ ఉంటాయి స్క్రీన్ లో.
పైన ఉన్న ఇమేజ్ Slashleaks చే పోస్ట్ చేయబడింది. అలాగే S8 లో 5 in మరియు 6 in డిస్ప్లే వేరియంట్స్ ఉండనున్నాయి అని తెలుస్తుంది.
