శామ్సంగ్ గలాక్సీ ఆన్8 ని రూ 18,000 ధరతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం

శామ్సంగ్ గలాక్సీ ఆన్8 ని  రూ 18,000 ధరతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం
HIGHLIGHTS

శామ్సంగ్ గలాక్సీ ఆన్8 వెనుక డ్యూయల్-కెమేరా మరియు 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి తో రావచ్చని అంచనా .

 శామ్సంగ్ కంపెనీ 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజి తో కూడిన  గలాక్సీ ఆన్8 (2018 వెర్షన్) ని ఈ వారం తరువాత ఇండియా లో విడుదల చేయడానికి నివేదికలు సిద్ధం చేస్తోంది. IANS ప్రకారంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక డ్యూయల్-కెమేరా అమర్చబడి ఉంటుంది. ఫ్లిప్కార్ట్ -ఎక్స్ క్లూజివ్ గా అందించబోతున్న ఈ స్మార్ట్  ఫోన్ యొక్క ధర దాదాపుగా 18,000 గా ఉండే అవకాశం ఉంది . ఇది దక్షిణ కొరియా దిగ్గజమైన శామ్సంగ్  మనదేశంలో జులై 2 న విడుదల చేసిన గలాక్సీ ఆన్6 తర్వాత, ఆన్లైన్ లో విడుదల కానున్న సంస్థ యొక్క రెండవ  ప్రత్యేక-పరికరం.

గెలాక్సీ ఆన్8 ఒక 6-ఇంచ్ హెచ్ డి+అమోల్డ్ డిస్ప్లే మరియు క్వాల్కమ్  స్నాప్ డ్రాగన్ ఆక్టా -కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేయవచ్చు .  శామ్సంగ్ కంపెనీ యొక్క  గలాక్సీ జె8 మరియు గలాక్సీ జె6 స్మార్ట్ ఫోన్లు  సాధించిన  2 మిలియన్ యూనిట్ల అమ్మకాల గురించి అధికారిక ప్రకటన మూలాల ద్వారా తెలియవచ్చింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా శామ్సంగ్ యొక్క సిగ్నచేర్ ఇన్ఫినిటీ డిస్ప్లే సూపర్ అమోల్డ్ టెక్నాలజీ తో వచ్చాయి. శామ్సంగ్ గెలాక్సీ జె8 రూ .18,990 మరియు గెలాక్సీ జె6 64జీబీ రూ .15,990  ఇంకా 32జీబీ   రూ .13,990 లతో అందుబాటులో ఉన్నాయి.

"ఈ మోడల్స్ భారీ గిరాకీని కలిగి ఉన్నాయి మరియు రోజుకు  50,000 మంది వినియోగదారులను ఆకర్షించడం ద్వారా శామ్సంగ్ గెలాక్సీ J అనేది దేశంలో 'అత్యంత ప్రియమైన' స్మార్ట్ఫోన్లు", గా ఉన్నాయని కంపెనీ  పేర్కొంది. గెలాక్సీ జె8 మరియు గెలాక్సీ జె6 రెండు ఫోన్లలలో  కూడా సిగ్నచేర్ శామ్సంగ్ ఇన్ఫినిటీ డిస్ప్లే డిజైన్ తత్వాన్ని ఉపయోగించడం ద్వారా ఫోన్ మొత్తం పరిమాణం లో ఏమాత్రం మార్పు లేకుండానే డిస్ప్లే ఒక్క పరిమాణాన్ని 15 శాతం పెంచగలిగారు. అంటే ఈ రెండు ఫోన్లు కూడా వినియోగదారులకు  15 శాతం అధిక డిస్ప్లే ను అందిస్తాయన్నమాట.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo