Ai Plus నుంచి Pulse 2 స్మార్ట్ ఫోన్, పాడ్ మరియు బడ్స్ లాంచ్ అవుతున్నాయి.!

HIGHLIGHTS

Ai Plus నుంచి Pulse 2 స్మార్ట్ ఫోన్, పాడ్ మరియు బడ్స్ లాంచ్ అవుతున్నాయి

స్మార్ట్ ఫోన్, పాడ్ మరియు మరిన్ని ప్రొడక్ట్స్ లాంచ్ డేట్ మరియు కీలక వివరాలు ఈరోజు కంపెనీ రివీల్ చేసింది.

ఏఐ ప్లస్ నుంచి లాంచ్ చేస్తున్న ఈ అప్ కమింగ్ ఫోన్ కీలక వివరాలు కంపెనీ ఈరోజు రివీల్ చేసింది

Ai Plus నుంచి Pulse 2 స్మార్ట్ ఫోన్, పాడ్ మరియు బడ్స్ లాంచ్ అవుతున్నాయి.!

Ai Plus నుంచి Pulse 2 స్మార్ట్ ఫోన్, పాడ్ మరియు బడ్స్ లాంచ్ అవుతున్నాయి. మాధవ్ సేథ్ సారధ్యంలో నడుస్తున్న మేడ్ ఇన్ ఇండియా కంపెనీ నుంచి ఈ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ కోసం సిద్ధం అయ్యాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్, పాడ్ మరియు మరిన్ని ప్రొడక్ట్స్ లాంచ్ డేట్ మరియు కీలక వివరాలు ఈరోజు కంపెనీ రివీల్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Ai Plus Pulse 2 రిలీజ్ డేట్

ఏఐ ప్లస్ కొత్తగా ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్, బడ్స్ మరియు కొత్త పాడ్ ను లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రొడక్ట్స్ ను మార్చి 2వ తేదీ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. మార్చి 2వ తేదీన లాంచ్ చేయనున్నట్లు చెబుతున్న ప్రొడక్ట్స్ వివరాలు మరియు లాంచ్ డేట్ తో ఈరోజు కొత్త టీజర్ రిలీజ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మరియు ప్రోడక్ట్స్ కోసం ఫ్లిప్ కార్ట్ నుంచి ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది.

Ai Plus Pulse 2 : ఫీచర్స్

ఏఐ ప్లస్ నుంచి లాంచ్ చేస్తున్న ఈ అప్ కమింగ్ ఫోన్ కీలక వివరాలు కంపెనీ ఈరోజు రివీల్ చేసింది. ఈ ఫోన్ ను చాలా సన్నని డిజైన్ తో అందిస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Ai Plus Pulse 2 Launch

ఇక ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ చూస్తే, ఈ ఫోన్ Unisoc T7250 ఆక్టా కోర్ చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను 128GB స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను డ్యూయల్ టోన్ ఫినిష్ తో అందిస్తుంది.

Also Read: Flipkart Sale బిగ్ డీల్స్ తో ఆటోమేటిక్ Washing Machines చాలా చవక ధరలో లభిస్తున్నాయి.!

ఇతర ప్రొడక్ట్స్

స్మార్ట్ ఫోన్ తో పాటు ఏఐ ప్లస్ నుంచి కొత్త పాడ్ మరియు కొత్త స్మార్ట్ వాచ్ మరియు కొత్త బడ్స్ కూడా లాంచ్ అవుతున్నాయి. వీటిలో ప్యాడ్ స్లీక్ డిజైన్ మరియు వెనుక సింగల్ కెమెరా సెటప్ తో ఉంటుంది. అయితే, స్మార్ట్ వాచ్ రౌండ్ స్క్రీన్ కలిగి మంచి రిజల్యూషన్ అందించే స్క్రీన్ మరియు ఇతర ఆకర్షణీయమైన ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo